E-Paper
Advertisement

BMW film: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్.. రేపే ప్రోమో!

BMW film: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్.. రేపే ప్రోమో!
Advertisement

BMW Film: రవితేజ(Raviteja) హీరోగా  కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Wignyapthi). ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఈ క్రమంలోని ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో విడుదల చేశారు ఇందులో భాగంగా రవితేజ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. “బెల్లా బెల్లా ” (Bella Bella)అనే పాటను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమో రేపు సాయంత్రం 4:05 విడుదల కాబోతోంది అలాగే పూర్తి పాటను డిసెంబర్ 1 వ తేదీ విడుదల కాబోతోంది.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా..

ఇక ఈ సినిమా 2026 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరిలో రాబోతోంది అయితే ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా ఆశిక రంగనాథ్ కేతిక శర్మ హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఇద్దరి మధ్య రవితేజ ఎదుర్కొనే ఇబ్బందులు ఎలాంటివి? వాటిని ఎలా పరిష్కరించబోతున్నారనే విధంగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా చూస్తుంటే రవితేజ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయబోతున్నారని స్పష్టమవుతుంది.

నిరాశపరిచిన మాస్ జాతర..

Advertisement

ఇక ఈ సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ రెడ్డి నిర్మించబోతున్నారు. మరి ఈ సినిమా రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు రవితేజ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల మాస్ జాతర సినిమా ద్వారా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచింది.

Advertisement

ఈ క్రమంలోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా మరోసారి రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచింది. మరి ఈ సినిమాకి రవితేజ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఈయన తన తదుపరి సినిమాలపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి వరుస సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Akhanda 2 Censor: అఖండ 2 సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×