E-Paper
Advertisement

OTT Movie : విజయ్ వర్మ కొత్త రొమాంటిక్ మూవీ ఆ ఓటీటీలోకి… థియేటర్లలో అడుగు పెట్టక ముందే

OTT Movie : విజయ్ వర్మ కొత్త రొమాంటిక్ మూవీ ఆ ఓటీటీలోకి… థియేటర్లలో అడుగు పెట్టక ముందే
Advertisement

OTT Movie : విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ నటించిన ‘గుస్తాఖ్ ఇష్క్’ ఈ రోజు (నవంబర్ 28) థియేటర్లలో అడుగు పెట్టింది. రిలీజ్ కి ముందే ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ దీని స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తరువాత ఈ సినిమా వచ్చేనెల చివరి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ స్టోరీ ఒక వృద్ధ ఉర్దూ కవి కుమార్తెతో ప్రేమలో పడే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఫీల్ గుడ్ కంటెంట్ తోనే ఈ మూవీ తెరకెక్కింది. ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమీటి అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందిన ‘గుస్తాఖ్ ఇష్క్’ (Gustaakh Ishq) 2025 నవంబర్ 28న థియేటర్లలో విడుదల అయింది. థియేట్రికల్ రన్ తరువాత జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానుంది. ఇందులో విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్, నసీరుద్దీన్ షా లీడ్ రోల్స్ లో నటించారు. ట్రైలర్ లోనే ఈ సినిమా కంటెంట్ ఎలా ఉంటుందో చూపించారు. ఈ సినిమాతో విజయ్ వర్మ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం గ్యారంటీ.

Advertisement

Read Also : మొదటి రాత్రే ఫుల్ బాటిల్ లేపే భార్య… గుటకలు మింగే భర్త… ఈ పంజాబీ సినిమాతో భలే కిక్కు మావా

స్టోరీ ఏమిటంటే

1990 కాలంలో జరిగే ఈ కథలో పప్పన్ (విజయ్ వర్మా) తన తండ్రి చనిపోవడంతో ఉర్దూ పత్రిక “ముస్తాక్బిల్”ని కాపాడుకోవడానికి ప్రాణం పెట్టి పోరాడుతాడు. తండ్రి చనిపోవడంతో దానిని నడపడానికి కనీస ఆర్థిక పరిస్థితి కూడా ఉండదు. ఈ సమయంలో ప్రముఖ రచయిత అజిజ్ మౌల్వీ (నసీరుద్దీన్ షా) ఇంటర్వ్యూకి వెళ్లి, అక్కడే అజిజ్ కూతురు అఫ్సా (ఫాతిమా సనా షేక్)ని చూసి ప్రేమలో పడతాడు. అజిజ్ సాయంతో షాయరీ నేర్చుకుంటూ, ఆమెతో రొమాన్స్ మొదలెడతాడు. ఇద్దరూ వేరే లోకంలో తేలుతుంటారు. ఒక రోజు పత్రిక కోసం డబ్బు సంపాదించాలని పప్పన్ ఢిల్లీ వెళ్లిపోతాడు. రెండేళ్లు లేఖలు రాయడం మానేస్తాడు. అఫ్సాకి పప్పన్ నన్ను వదిలేసాడని మిస్‌ అండర్‌స్టాండింగ్ చేసుకుంటుంది. దీంతో పంజాబ్‌లో తన ఊరికి వెళ్లి పెళ్లి ఫిక్స్ చేసుకుంటుంది. ఆ తరువాత పప్పన్ డబ్బుతో తిరిగి వచ్చి అఫ్సా పెళ్లి రోజు మండపంలోకి వెళ్తాడు. ఆతరువాత ఏం జరిగిందనేది ? ఈ రొమాంటిక్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×