BigTV English

Ravi teja: భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ..సంక్రాంతి బరిలో మాస్ హీరో?

Ravi teja: భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ..సంక్రాంతి బరిలో మాస్ హీరో?

Raviteja: మాస్ మహారాజ రవితేజ(Raviteja) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఈయన వచ్చిన అవకాశాలన్నింటిని వినియోగించుకుంటూ వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక త్వరలోనే మాస్ జాతర (Mass Jathara)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో శ్రీ లీల, రవితేజ జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ తన తదుపరి చిత్రాన్ని కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు.


చివరి దశ షూటింగ్ లో ఆర్టీ 76..

ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది ప్రస్తుతం చిత్ర బృందం స్పెయిన్ లో చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్నట్టు సమాచారం. ఈనెల ఆఖరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఇలా ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఆర్టీ 76 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇదివరకు ఈ సినిమాకు “అనార్కలి” అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

భర్త మహాశయులకు విజ్ఞప్తి..

తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు “భర్త మహాశయులకు విజ్ఞప్తి”అనే టైటిల్ పరిశీలనలో ఉందని దాదాపు ఈ టైటిల్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టైటిల్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా పక్కా సంక్రాంతి సినిమా అని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రవితేజకు ఇలాంటి టైటిల్స్ బాగా సెట్ అవుతాయని అభిమానులు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.


సంక్రాంతి పోటీకి సై అంటున్న రవితేజ…

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఆషిక రంగనాథ్, కేతిక శర్మ సందడి చేయబోతున్నారు. ఇలా రవితేజ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ బయటకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్టార్ హీరోల నుంచి మొదలుకొని మీడియం రేంజ్ హీరోలు కూడా సినిమాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో పాటు, ప్రభాస్ రాజా సాబ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక త్వరలోనే రవితేజ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది.

Also Read: Samantha: పండగపూట గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. విడాకుల తరువాత ఇలా!

Related News

Indian Movie’s: ఇండియన్ చిత్రాల థియేటర్లపై దాడులు.. కక్ష సాధింపు చర్యలేనా?

Aishwarya -Abhishek: వారి పై రూ. 4 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఐశ్వర్య దంపతులు..ఇదే కారణమా?

Alia Bhatt: ప్రతినెల కూతురి కోసం ఆ పని చేస్తున్న అలియా.. నిజంగా క్యూట్ అబ్బా!

Film industry: నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో.. ఏకంగా అంతరిక్షంలో పెళ్లి!

Actress Kajol: నటి కాజోల్ కి ఘోర అవమానం.. పబ్లిక్ లో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ!

Kantara Chapter 1: కాంతార 2 ఫస్ట్ డే కలెక్షన్స్..ఆ సినిమాలన్నీ వెనక్కే?

Rahul Ramakrishna: ఏంటి రాహుల్ భయపడ్డావా? ఏకంగా అకౌంట్ డిలీట్ చేశావ్!

Big Stories

×