Pregnancy tourism: ప్రపంచంలో పర్యటన అంటే మనకి గుర్తొచ్చేది కొండలు, జలపాతాలు, సుందరమైన ప్రకృతి, చారిత్రక ప్రదేశాలు. కానీ మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ టూరిజం అనే ఒక ప్రత్యేకమైన పర్యటన రకం కూడా ఉందని. అదేంటంటే, గర్భం దాల్చేందుకు కొన్ని ప్రాంతాలకు వెళ్లే పర్యటన. ఇందులో భాగంగా యూరప్ దేశాలకు చెందిన మహిళలు భారతదేశం లోని లద్దాఖ్ ప్రాంతానికి వస్తున్నారు అన్న విషయం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. మహిళలు ఇక్కడికి రావడానికి ప్రత్యేకత ఏమిటి? దాని వివరాలు తెలుసుకుందాం.
సింధూ నది ఒడ్డున బ్రోక్పా తెగ
లద్దాఖ్ అనగానే మనకు గుర్తొచ్చేది మంచుతో కప్పబడిన పర్వతాలు, విభిన్న సంస్కృతి, బౌద్ధ మఠాలు. కానీ ఇక్కడ ఇంకా ఒక వింత నిజం దాగి ఉంది. అదేంటంటే, లద్దాఖ్‌లోని సింధూ నది ఒడ్డున నివసించే బ్రోక్పా అనే ఒక చిన్న తెగ. వీరిని ప్రపంచంలో చివరిగా మిగిలిన స్వచ్ఛమైన ఆర్యులు (Pure Aryans) అని భావిస్తున్నారు.
బ్రోక్పా తెగలో స్సెషల్ ఏమిటి?
ఈ బ్రోక్పా తెగలో ఉన్నవాళ్లకు ఎత్తైన శరీరం, తెల్లగా మెరిసే చర్మం, నీలిరంగు కళ్లు, గోధుమవర్ణపు జుట్టు వంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వీరిని చూసినప్పుడల్లా యూరోపియన్ రూపు గుర్తొస్తుంది. వీరు తమ సంప్రదాయాన్ని, రక్తాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవడానికి వందల ఏళ్లుగా కఠిన ఉపవాసాలు, మంచి ఆహారం, వ్యాయామాలతో ఆరోగ్యానికి రక్షించుకుంటున్నారు. బయటివారితో పెళ్లి చేసుకోవడం కూడా వీరు చాలా అరుదు.
అక్కడి మగవారితో పిల్లుల కనడం !
ఇప్పుడీ తెగ ప్రత్యేకతే కారణమై యూరప్ నుండి మహిళలు లద్దాఖ్ వరకు వస్తున్నారు. ఎందుకంటే వారిలో చాలామంది నమ్మకం ఏమిటంటే, బ్రోక్పా తెగలోని పురుషులతో సన్నిహితమవడం ద్వారా “శుద్ధ ఆర్య” పిల్లలకు జన్మనివ్వొచ్చని. ఈ నమ్మకమే వారిని ఇక్కడికి లాక్కొస్తోంది.
Also Read: Pumpkin Seeds: గుమ్మడి గింజలు రోజుకు ఎంత తినాలి? చిన్న పిల్లలకు నేరుగా పెట్టొచ్చా?
ఆర్యుల వారసులమే అంటున్న బ్రోక్పా ప్రజలు
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బ్రోక్పా ప్రజలు తమను ఆర్యుల వారసులమే అని గర్వంగా చెప్పుకుంటారు. “మీరు పుస్తకాల్లో చదివే ఎత్తైన శరీరం, నీలి కళ్ళు ఉన్న ఆర్యులు మేమే” అని స్థానికులు అంటుంటారు. వీరి మాటల్లోనూ ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రెగ్నెన్సీ టూరిజం కాన్సెప్ట్ ఏమిటి?
ప్రెగ్నెన్సీ టూరిజం అనే కాన్సెప్ట్ వల్ల లద్దాఖ్ ప్రాంతం పర్యాటకులకు మాత్రమే కాకుండా, శాస్త్రీయ, చారిత్రక చర్చలకు కూడా కేంద్రబిందువుగా మారింది. యూరప్ మహిళలు ఎందుకు ఇక్కడికి వస్తారు అనే ప్రశ్నకు స్థానికులు చెప్పే సమాధానం ఏంటంటే – “ఆర్యుల వంశాన్ని కొనసాగించాలనే కోరిక”.
శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?
వీరి ఈ నమ్మకానికి శాస్త్రీయ ఆధారాలేమీ ఇప్పటివరకు లేవు. కానీ ఒక రహస్యమైన ఆకర్షణ మాత్రం బ్రోక్పా తెగలో ఉంది అనేది నిజం. పర్వతాల మధ్య ఒదిగిన ఆ చిన్న గ్రామాలు, ప్రత్యేకమైన సంస్కృతి, వింత సంప్రదాయాలు – ఇవన్నీ ఈ తెగను మరింత ప్రత్యేకం చేస్తున్నాయి.
బ్రోక్పా తెగపై పరిశోధన
ప్రపంచం నలుమూలల నుండి ఈ బ్రోక్పా తెగపై పరిశోధకులు, పర్యాటకులు, మీడియా దృష్టి పడుతోంది. ఎవరో కొందరు వీరిని ఒక సజీవ మ్యూజియం అని అంటారు. ఎందుకంటే వందల ఏళ్లుగా మారని సంప్రదాయ జీవన విధానాన్ని నేటికీ కాపాడుకుంటూ వస్తున్నారు.
క్యూ కడుతున్న యూరప్ మహిళలు
మరి యూరప్ మహిళలు ఇక్కడికి ఎందుకు వస్తారు? అందుకు ఒకే సమాధానం – స్వచ్ఛమైన ఆర్యుల వారసులను కనాలనే ఆశ. అది నిజమా కాదా అనేది ఇంకా చర్చనీయాంశమే. కానీ లద్దాఖ్‌లోని బ్రోక్పా తెగ కారణంగా “ప్రెగ్నెన్సీ టూరిజం” అనే పదమే ఒక సెన్సేషన్‌గా మారింది.