Samantha: సమంత(Samantha) సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులను సందడి చేస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత తన వ్యక్తిగత కారణాలవల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడిప్పుడే తిరిగి కెరియర్ పై ఫోకస్ పెడుతూ సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండే సమంత నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియచేస్తూ ఉంటారు.
ఇక ఈ దసరా పండుగను పురస్కరించుకొని ఎంతోమంది సెలబ్రిటీలు వరుస అప్డేట్లను అభిమానులతో పంచుకుంటున్నారు. కొంతమంది సెలబ్రిటీలు తమ కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలను తెలియజేయగా మరికొందరు వారి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత సైతం అభిమానులకు ఒక శుభవార్తను తెలియజేశారు. సమంత తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన సమంత న్యూ బిగినింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఇంటికి బయట శ్యామ్ అని పేరు కూడా రాయించారు. ఈ ఫోటో చూస్తుంటే సమంత కొత్త ఇల్లు కొనుగోలు చేశారని స్పష్టమవుతుంది.
ఇలా సమంత కొత్త ఇంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు సమంత కొత్త ఇల్లు కొనుగోలు చేశారని భావిస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. అయితే సమంత ఈ కొత్త ఇంటిని హైదరాబాద్లో కొనుగోలు చేశారా? లేదంటే ముంబైలో కొనుగోలు చేశారా? అనే విషయాలను ఎక్కడ వెల్లడించలేదు కానీ, నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఈమె తిరిగి మొదటిసారి ఇలా కొత్త ఇంటిని కొనుగోలు చేశారని స్పష్టమవుతుంది. తన ఇంటి ప్రధాన ద్వారాన్ని అందంగా పువ్వులతో అలంకరించారు అలాగే తన ఇంట్లో పూజ మందిరానికి సంబంధించిన ఫోటోని కూడా సమంత షేర్ చేశారు.
ఈ పోస్ట్ కు అర్థం ఏంటి సామ్?
ఈ విధంగా కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ న్యూ బిగినింగ్స్ అంటూ ఈమె చెప్పడంతో ఇల్లును ఉద్దేశించే సమంత ఇలా చెప్పారా? లేకపోతే పెళ్లి గురించి త్వరలో మరో శుభవార్తను ఏమైనా చెప్పబోతున్నారా?అంటూ మరి కొంతమంది సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా పండుగ పూట సమంత ఇలా శుభవార్తను తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో ఖుషీ అవుతూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇకపోతే సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత మరొక డైరెక్టర్ రాజ్ నిడుమోరి(Raj Nidumori)తో రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు సమంత ఎక్కడ స్పందించిన దాఖలాలు కూడా లేవు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి . ఇలాంటి నేపథ్యంలోనే ఈమె న్యూ బిగినింగ్స్ అంటూ ఫోటోలు షేర్ చేయడంతో పెళ్లి విషయంపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kanatara 1 – Prabhas: కాంతార1 కు కల్కి రివ్యూ.. మరింత హైప్ ఇచ్చాడుగా!