T20 World Cup 2026: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఇటీవల ముగియగా… అందరి దృష్టి ఇటువంటి వరల్డ్ కప్ 2026 పైన ( T20 World Cup 2026 ) పడింది. వచ్చే సంవత్సరం ఈ టోర్నమెంట్ జరగనుంది. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు శ్రీలంక అలాగే ఇండియా దేశాలు… హోస్ట్ గా వ్యవహరిస్తున్నాయి. అంటే ఈ టోర్నమెంట్ మొత్తం ఇండియా అలాగే శ్రీలంకలో జరుగుతుంది. కొన్ని మ్యాచ్లు ఇండియాలో జరిగితే మరికొన్ని మ్యాచులు శ్రీలంకలో జరుగుతాయి. అయితే ఈ టోర్నమెంట్ కోసం మొత్తం 20 జట్లు.. రంగంలోకి దిగుతాయి. ఇప్పటికే 17 జట్లు క్వాలిఫై అయ్యాయి. మరో మూడు జట్లు క్వాలిఫై కావాల్సి ఉంది.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) నేపథ్యంలో మొత్తం 20 జట్లు రంగంలో ఉన్నాయి. ఈ 20 జట్లు మొత్తం 55 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఈ 20 జట్లను ఐదు గ్రూపులుగా డివైడ్ చేస్తారు. గ్రూప్ స్టేజి ఆడిన తర్వాత సూపర్ 8 స్టేజ్ ఉంటుంది. అనంతరం నాకౌట్ స్టేజ్ ఉంటుంది. అంటే సెమీఫైనల్స్ ఆ తర్వాత ఫైనల్స్ అన్నమాట.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో…. షెడ్యూల్ దాదాపు ఖరారైంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు దాదాపు నెల రోజులపాటు ఈ 55 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఇండియా అలాగే శ్రీలంక దేశాల్లో.. మ్యాచ్లు జరుగుతాయి. పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలోనే నిర్వహించనున్నారు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఒకవేళ మ్యాచ్లు జరిగితే అప్పుడు కూడా శ్రీలంక వేదిక అవుతుంది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరిగిన కూడా శ్రీలంక ఫైనల్… నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఐర్లాండ్ న్యూజిలాండ్ 3 జట్లు ఐసిసి టి20 ర్యాంకింగ్స్ ప్రకారం క్వాలిఫై అయ్యాయి. అలాగే టి20 వరల్డ్ కప్ 2024 లో అద్భుతంగా రాణించిన ఆఫ్గనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా యుఎస్ఏ వెస్టిండీస్ అర్హత సాధించాయి. ఇక రీజినల్ సిరీస్లలో అద్భుతంగా రాణిస్తున్న కెనడా ఇటలీ నెదర్లాండ్స్ నమీబియా, జింబాబ్వే కూడా అర్హత సాధించాయి. శ్రీలంక అలాగే ఇండియా ఈ టోర్నమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కాబట్టి రెండు జట్లు క్వాలిఫై అయ్యాయి. అందులోనూ 2024 టోర్నమెంట్ ఛాంపియన్గా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ ఫైనల్ లో ఫలితం ఆధారంగా మరో మూడు జట్లు అర్హత సాధిస్తాయి.
ఇండియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, USA, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ, నమీబియా.
🚨 BREAKING 🚨
Zimbabwe and Namibia have qualified for the T20 World Cup 2026 in India and Sri Lanka. 🏆
Take a look at the teams qualified so far for the mega event. 🔥#Cricket #T20WC #ICC #Sportskeeda pic.twitter.com/3UhHwLAC4b
— Sportskeeda (@Sportskeeda) October 2, 2025