Movie Scam:మాములుగా సినిమా నిర్మాణంలో భారీ బడ్జెట్ పెట్టడం కామన్ . ఇక స్టార్ హీరోలు, భారీ సెట్స్, ఖరీదైన లొకేషన్స్, వందల మంది సిబ్బంది ఉంటే ఖర్చు కోట్లలోకి వెళ్లడం కూడా అంతే కామన్ .
కానీఓ భారీ బడ్జెట్ సినిమా నిర్మాణంలో ఖర్చులు ఒక్కసారిగా పెరిగి పోయాయట .ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా ?అయితే అది మేకింగ్ లో జరిగిన ఖర్చు కాదట.అసలేమైందో ఒకసారి చూసేద్దాం.
తెరవెనుక గోల్‌మాల్
సెట్స్ పై ఉన్న ఒక భారీ బడ్జెట్ సినిమా విషయంలో తెరవెనుక గోల్‌మాల్ జరిగిందన్న వార్త ఇపుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జరిగిన ఇంటర్నల్ ఆడిట్‌లో కొన్ని అనుమానంగా ఉన్న లావాదేవీలు బయటపడినట్లు తెలుస్తుంది.
ఇందులో సినిమా మేకింగ్ కి సంబంధించిన మెటీరియల్ కొనుగోళ్ల విషయంలో అసలు వస్తువులు కొనుగోలు చేయకుండానే బిల్లులు సృష్టించినట్లు ఆడిట్‌లో గుర్తించినట్లు వినిపిస్తుంది. ముఖ్యంగా జీఎస్టీ ఇన్‌వాయిస్‌ల విషయంలో కొంత గోల్ మాల్ జరిగినట్టు సమాచారం.
కాగితాలపై మాత్రం భారీ మొత్తానికి మెటీరియల్ కొనుగోలు జరిగినట్లు కనిపించినా, వాస్తవంగా ఆ సామగ్రి ఎక్కడికి వెళ్లింది? ఎవరి నుంచి కొనుగోలు చేశారు? అనే ప్రశ్నలకు సరైన ఆధారాలు కనిపించలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
వర్కర్ల పేర్లతో వేతనాల ఓచర్లు తయారు
ఇక ఇక్కడితో ఆగకుండా సెట్స్‌పై పనిచేసిన వర్కర్ల పేర్లతో వేతనాల ఓచర్లు తయారు చేసి ఖర్చులు చూపించినట్లు కూడా ఆడిట్‌లో గుర్తించినట్లు తెలుస్తోంది. కొందరి పేర్లు పేమెంట్ రికార్డుల్లో ఉన్నప్పటికీ, వారు నిజంగా ఆ ప్రాజెక్ట్‌లో పనిచేశారా లేదా అన్నదానిపై కూడా ఎంక్వైరీ జరుగుతుందట. దీంతో ప్రొడక్షన్ అకౌంట్స్‌పై మరింత లోతుగా పరిశీలిస్తున్నారట.
ఇందులో ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఖర్చులేనని చెబుతున్నారు. భారీ సెట్స్ కోసం అవసరమైన మెటీరియల్, కార్మికుల ఖర్చులు, ట్రాన్స్‌పోర్ట్, ఇతర ప్రొడక్షన్ ఎక్స్‌పెన్సెస్ పేరుతో భారీ మొత్తాలు చూపించినట్లు సమాచారం. అయితే వాటిలో కొంత భాగానికి సరైన పేపర్లు లేకపోవడంతోఅనుమానాలు మరింత బలపడ్డాయని తెలుస్తోంది.
మరోవైపు, ఆడిట్ బృందం కొన్ని ఆర్థిక లావాదేవీలను హైదరాబాద్ శివార్లలోని ఆస్తులతో లింక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా నిర్మాణ ఖర్చుల్లో నుంచి అక్రమంగా మళ్లించారనే అనుమానం ఉన్న మొత్తంతో ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే ఆ ఆస్తులు నేరుగా సదరు వ్యక్తి పేరుపై కాకుండా ఇతరుల పేర్లపై ఉండటంతో వాటి వెనుక అసలు లబ్ధిదారులు ఎవరు అన్న కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడికి కూడా పెద్ద షాక్
ఈ లెక్కలన్నీ బయటకు రావడంతో దర్శకుడికి కూడా పెద్ద షాక్ తగిలినట్లు సమాచారం. సినిమా కోసం తాను కోరుకున్న స్థాయిలో సెట్స్, మేకింగ్, ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నందుకే ఖర్చులు పెరుగుతున్నాయని దర్శకుడు భావించారని, కానీ ఖర్చుల వెనుక ఇలాంటి ఆరోపణలు వినిపించడంతో ఆయన కూడా ఆశ్చర్యపోయారని తెలుస్తుంది.
అయితే ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుందా? లేక ఇండస్ట్రీలోనే పరిష్కరించుకుంటారా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. విషయం బయటకు వెళ్తే సినిమా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు, నిర్మాతల భవిష్యత్ ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నట్లు సమాచారం.
ఇంకెన్ని మలుపులు తిరగనుందో
అందుకే మొదట నష్టాన్ని అంచనా వేసి, చట్టపరమైన వివాదంగా మారకుండా సెటిల్‌మెంట్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.దీంతో ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న కొన్ని సంస్థలు తమ ప్రొడక్షన్ అకౌంట్స్‌పై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్, మెటీరియల్ కొనుగోళ్లు, క్యాష్ పేమెంట్లు, వర్కర్ల వేతనాలు, ట్రాన్స్‌పోర్ట్ బిల్లులు వంటి వాటిని క్రాస్ చెక్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Also read :తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ‘మీటూ’ మంటలు.. బాంబు పేల్చిన సింగర్!
ఇప్పటికే సెట్స్‌పై ఉన్న మరో రెండు భారీ ప్రాజెక్టుల నిర్మాతలు కూడా ముందస్తు ఇంటర్నల్ ఆడిట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.
చూడాలి ముందు ముందు ఈ గోల్ మాల్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరగనుందో !