E-Paper
Advertisement

రియాజ్.. నీకు బుర్ర ఉందా ? 55 ప‌రుగుల చేసిన పాకిస్తాన్, ఎలా ఆసియా క‌ప్ కొడుతుంది ?

రియాజ్.. నీకు బుర్ర ఉందా ? 55 ప‌రుగుల చేసిన పాకిస్తాన్, ఎలా ఆసియా క‌ప్ కొడుతుంది ?
Advertisement

Tanveer Ahmed Counter Wahab Riaz: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) నేపథ్యంలో పాకిస్తాన్ కు ఘోర ఓటమి ఎదురైంది. టీమిండియా చేతిలో అత్యంత దారుణంగా నిన్న ఓడిపోయింది పాకిస్తాన్. ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో 55 పరుగులు మాత్రమే చేసిన పాకిస్తాన్.. 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి అనంతరం పాకిస్తాన్ కోచ్ వహాబ్ రియాజ్ (Wahab Riaz) చేసిన వ్యాఖ్యలకు తన్వీర్ అహ్మద్ కౌంటర్ ఇచ్చాడు. బుద్ధిలేని వెధవకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని ఫైర్ అయ్యారు. 55 పరుగులు చేసిన పాకిస్తాన్ తో ఎలా టైటిల్ కొట్టిస్తాడో చూడాలి అంటూ ఆగ్రహించారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్.

అసలు వహాబ్ రియాజ్ ఏమన్నాడంటే?

ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్ 2026 నేపథ్యంలో నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ 55 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి గెలుపొందింది టీమిండియా. ఇంత దారుణమైన ఓటమి ఎదురైన తర్వాత కూడా పాకిస్తాన్ హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ ఓవర్ గా మాట్లాడుతూ ప్రెస్ ను అడ్రస్ చేశారు. 55 పరుగులు చేసిన పాకిస్తాన్ తోనే ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ట్రోఫీ కొట్టిస్తానని శపథం చేశారు. ఇండియా చేతిలో ఓడిపోయినప్పటికీ ఛాంపియన్ మాత్రం పాకిస్తాన్ అంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

55 ప‌రుగుల చేసిన పాకిస్తాన్, ఎలా ఆసియా క‌ప్ కొడుతుంది ?

పాకిస్తాన్ ఓటమిపై వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలకు తన్వీర్ అహ్మద్ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. 55 పరుగులు చేసిన పాకిస్తాన్ జట్టుతో ఎలా టైటిల్ కొట్టిస్తాడో తాను చూస్తానని మండిపడ్డారు. ఆ స్టేట్మెంట్ విన్నాక అసలు వహాబ్ రియాజ్ కు బుర్ర ఉందా? అనే డౌట్ తనకు వచ్చిందని పరువు తీశారు. వ‌హాబ్ రియాజ్ చెప్పినట్లుగా పాకిస్తాన్ గనక టైటిల్ కొట్టకపోతే వాడి అంతు చూస్తానని హెచ్చరించారు. పాకిస్తాన్ ఓడిపోయి ఇంటి దారి పడితే, మాత్రం వాడి ఇంటికి గాజులతో పాటు చీరలు పంపిస్తానని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

Advertisement

అయితే దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ ఓటమిని తట్టుకోలేని త‌న్వీర్ అహ్మద్… మళ్లీ ఇండియాపై విషం కక్కాడు. దుబాయ్ పిచ్ లో AI చిప్స్ ఇన్స్టాల్ చేశారని… అందుకే టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని వ్యాఖ్యానించారు. టీమిండియాకు అనుకూలంగా మైదానాన్ని మార్చింది జై షా అంటూ బాంబు పేల్చారు. జై షా ఐసీసీ చైర్మన్ గా ఉన్నన్ని రోజులు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయని ఆగ్రహించారు.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Related News

పాకిస్తాన్ జ‌ట్టులోనూ కోటీశ్వరులు…షోయ‌బ్ అక్త‌ర్ నుంచి బాబ‌ర్ వ‌ర‌కు ఎవ‌రి ఆస్తులు ఎంతంటే ?

పాకిస్తాన్ ఘోర ఓట‌మి…హుటా హుటిన‌ దుబాయ్ వెళ్లిన న‌ఖ్వీ..!

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం

వైభ‌వ్ ఓవ‌రాక్ష‌న్‌..మ్యాచ్ మ‌ధ్య‌లో తిల‌క్ వ‌ర్మ‌కు స్ట్రాంగ్ వార్నింగ్

లైవ్ మ్యాచ్ లో బ‌రితెగించిన పాక్ ఫ్యాన్స్‌…”క్రాంతి గౌడ్” మ‌గాడంటూ కేక‌లు !

55 ప‌రుగుల‌కే ఆలౌటైనా సిగ్గు రాలేదా? ఫాతిమా స‌నా ఓవ‌రాక్ష‌న్‌పై టీమిండియా క్రికెట‌ర్ సీరియ‌స్

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Big Stories

Advertisement
×