E-Paper
Advertisement

హైదరాబాద్‌లో నీటి వృథాపై నిఘా.. నవంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్, ఉల్లంఘిస్తే రూ. 5 వేలు ఫైన్

హైదరాబాద్‌లో నీటి వృథాపై నిఘా.. నవంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్, ఉల్లంఘిస్తే రూ. 5 వేలు ఫైన్
Advertisement

Hyderabad City: ఎల్‌నినో దెబ్బకు దక్షిణాది రాష్ట్రాలకు టెన్షన్ పట్టుకుంది. ప్రధాన నగరాలకు నీటి సరఫరా చేయడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో అలర్టయిన హైదరాబాద్ జలమండలి అధికారులు కఠినచర్యలు రెడీ అయ్యారు. నీటి వృథాను అరికట్టేందుకు వివిధ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. నవంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ రానున్నాయి.

హైదరాబాద్‌లో నీటి వృథాపై నిఘా

హైదరాబాద్‌, వరంగల్‌తోపాటు పలు నగరాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. తాజాగా హైదరాబాద్ జలమండలి కఠిన చర్యలకు సిద్ధమైంది. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆంక్షలు ఉల్లంఘించే వాటర్ ట్యాంకర్లకు రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు ఆ విభాగం ఎండీ అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.

నవంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్, రూ. 5 వేలు ఫైన్

Advertisement

సామర్థ్యానికి మించి ట్యాంకర్లలో నీటిని నింపడం ద్వారా వృథా కాకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ట్యాంకర్లలో లీకేజీలున్నా, మూతలు లేకపోయినా, మూతలను సరిగా వేయకపోయినా నీటిని నింపేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. నిబంధనలకు అనుగుణంగా లేని ట్యాంకర్లకు ఫిల్లింగ్ నిలిపి వేయనున్నట్లు తెలియజేశారు. నీటిని నింపే ముందు ప్రతి ట్యాంకర్‌ను తనిఖీ చేయాలని, అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో నిబంధనలు అమలవుతున్నాయా లేవా అనేది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఎండీ.

ఉల్లంఘనలకు పాల్పడే ట్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. నీటి వృథాను అరికట్టడంలో ట్యాంకర్ యజమానులు-డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ట్యాంకర్ అసోసియేషన్లు తమ సభ్యులకు కొత్త నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. నీటి రవాణా సమయంలో లీకేజీలు జరగకుండా నిబంధనలకు అనుగుణంగా ట్యాంకర్లను నిర్వహించాలని వెల్లడించారు. నీటి వృథాను తగ్గించి అందుబాటులో ఉన్న వాటిని సమర్థంగా వినియోగించడమే చర్యల ప్రధాన ఉద్దేశమని జలమండలి పేర్కొంది.

Advertisement

ALSO READ: ‘ధైర్యముంటే కొండగల్ రా.. సీఎం పవర్ ఏంటో చూపిస్తా’! జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్

ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు, సంబంధిత అసోసియేషన్లు సహకరించాలని కోరారు. నవంబర్ ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానుండడంతో వాటర్ ట్యాంకర్ల నిర్వహణపై పర్యవేక్షణ మరింత కఠినతరం కానుంది. మరోవైపు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే సీసీటీవీ కెమెరాల ద్వారా నీటి వృథాపై అధికారులు కన్నేసినట్టు కొందరు అధికారులు చెబుతున్నారు.

Related News

‘ధైర్యముంటే కొండగల్ రా.. సీఎం పవర్ ఏంటో చూపిస్తా’! జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్

ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క కీలక సమీక్ష.. ప్రధాన నిర్ణయాలు ఇవే!

కాసానికి లైన్ క్లియర్! బీసీ కార్డ్‌తో ఎమ్మెల్సీ బరిలోకి గులాబీ పార్టీ?

బీ కేర్ ఫుల్!.. ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా తెలుసు.. సైబరాబాద్‌ కమిషనర్ స్ట్రాంగ్ వార్నింగ్!

హైదరాబాద్ లో టెక్కీ ఆత్మహత్య.. ఉదయం ఆఫీసు.. రాత్రికి ఇంట్లో ఉరి, మృతురాలు సొంతూరు..

రైస్ మిల్లర్లపై సీఐడీ ఉక్కుపాదం.. జమ్మికకుంట, ములుగుల్లో అరెస్టులు!

ఫీజు బకాయిలు ఇవ్వరు కానీ లక్షల ఫైన్లా? ఇంటర్ బోర్డు వైఖరిపై ప్రైవేట్ కాలేజీల సంఘం ఆగ్రహం!

Big Stories

Advertisement
×