E-Paper
Advertisement

గోల్డెన్ చారియట్ రైలులో తక్కువ ధరకే ప్రయాణం? ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్!

గోల్డెన్ చారియట్ రైలులో తక్కువ ధరకే ప్రయాణం? ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్!
Advertisement

Golden Chariot Train Fares: కర్ణాటకలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. విలాసవంతమైన పర్యాటక రైలు గోల్డెన్ చారియట్‌లో ఆఫ్ సీజన్ సమయంలో రాయితీ ధరలను అందించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. ఖరీదైన రైలు ప్రయాణాన్ని కేవలం ధనికులకే పరిమితం చేయకుండా, సామాన్యులకూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

గోల్డెన్ చారియట్ 2026-27 సీజన్ ప్రారంభం

బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్‌ లో శనివారం గోల్డెన్ చారియట్ 2026-27 సీజన్‌ ను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్ణాటకలోని చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక ప్రాంతాలు, ప్రకృతి అందాలను పర్యాటకులు విలాసవంతమైన రైలు ప్రయాణం ద్వారా ఆస్వాదించవచ్చని తెలిపారు. అయితే, ఈ రైలు టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో సాధారణ పర్యాటకులకు కూడా ప్రయాణించే అవకాశం కల్పించాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై భారతీయ రైల్వే అధికారులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

ఆరు రోజుల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు

Advertisement

గోల్డెన్ చారియట్‌ లో పలు పర్యాటక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ‘ప్రైడ్ ఆఫ్ కర్ణాటక’ యాత్ర ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు సాగుతుంది. ఈ ప్రయాణంలో మైసూరు, బండిపూర్ అటవీ ప్రాంతం, హలేబిడు, చిక్కమగళూరు, హంపి, గోవా లాంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. పగటిపూట పర్యాటక ప్రాంతాలను సందర్శించి, రాత్రి సమయంలో రైలులో నెక్ట్స్ ప్లేస్ కు చేరుకునేలా ప్రయాణ ప్రణాళికను రూపొందించారు. ఆరవ రోజు రైలు తిరిగి బెంగళూరుకు చేరుకుంటుంది.

టికెట్ ధరలు ఎంతంటే?

ప్రస్తుతం ప్యాకేజీల ధరలు ఇలా ఉన్నాయి.

Advertisement

ప్రైడ్ ఆఫ్ కర్ణాటక: ఒక్కొక్కరికి రూ.4,87,500

జ్యూవెల్స్ ఆఫ్ సౌత్: ఒక్కొక్కరికి రూ.4,87,500

గ్లింప్సెస్ ఆఫ్ కర్ణాటక: ఒక్కొక్కరికి రూ.3,31,500

ఈ ధరల నేపథ్యంలో ఆఫ్ సీజన్‌ లో రాయితీలు అందిస్తే మరింత మంది పర్యాటకులు ఈ రైలు ప్రయాణంపై ఆసక్తి చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, రాయితీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎంత తగ్గింపు ఉంటుంది? అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.

పర్యాటక రంగానికి మరింత ఊతం

కొన్నేళ్ల పాటు నిలిచిపోయిన గోల్డెన్ చారియట్ రైలును 2024లో తిరిగి ప్రారంభించారు. ఈ రైలును చక్కగా  వినియోగించుకోవడం ద్వారా పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రైల్వే రూట్స్ విస్తరణపైనా కర్ణాటక ప్రభుత్వం, భారతీయ రైల్వే అధికారులు చర్చించనున్నారు. సాధారణ రైలు సేవలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయాలను పరిశీలించనున్నట్లు సీఎం తెలిపారు. మొత్తంగా, ఆఫ్ సీజన్ డిస్కౌంట్స్ అమలైతే గోల్డెన్ చారియట్ ప్రయాణం మరింత మందికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: బాబోయ్.. ఇది రైలా? హోటలా? ఇండియన్ రైల్వేపై ఫారిన్ కఫుల్ ప్రశంసలు!

Tags

Related News

ఢిల్లీలో కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి ఆ వెహికల్స్ కు నో ఎంట్రీ!

లోకో పైలట్లకు జీరో ఆల్కహాల్ రూల్.. రైల్వే బోర్డు షాకింగ్ డెసిషన్!

బాబోయ్.. ఇది రైలా? హోటలా? ఇండియన్ రైల్వేపై ఫారిన్ కఫుల్ ప్రశంసలు!

జియో IPO వస్తే ఫ్రీగా కుల్ఫీ పార్టీ.. గోల్డెన్ అంకుల్ అదిరిపోయే ఆఫర్!

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

హిమాలయాల్లో రైల్వే రూట్.. ఏకంగా 80 శాతానికి పైగా భూగర్భంలోనే!

ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందా? నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులు ఈజీగా రీఫండ్ అవుతాయి!

Big Stories

Advertisement
×