E-Paper
Advertisement

Big tv kissik Talks: నా జీవితంలో అదొక బ్లాక్ డే.. ఎమోషనల్ అయిన ప్రియాంక సింగ్!

Big tv kissik Talks: నా జీవితంలో అదొక బ్లాక్ డే.. ఎమోషనల్ అయిన ప్రియాంక సింగ్!
Advertisement

Big tv kissik Talks: సాయి తేజ అంటే ఇప్పుడు గుర్తుపట్టకపోవచ్చు కానీ ప్రియాంక సింగ్ (Priyanka Singh)లేదా పింకీ అంటే మాత్రం టక్కున అందరికీ ఈమె గుర్తుకు వస్తారు. జబర్దస్త్ షోలో సాయి తేజగా అందరికీ ఎంతో సుపరిచితమైన కమెడియన్ ఎక్కువగా లేడీ గెటప్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించేవారు. అయితే సాయి తేజగా అందరికీ పరిచయమై చివరికి సర్జరీ ద్వారా అమ్మాయిగా మారి ప్రియాంక సింగ్ అందరి ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుతం ప్రియాంక బుల్లితెరకు, వెండితెరకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈమె కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

అక్టోబర్ 22 బ్లాక్ డే..

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రియాంక కాస్త ఎమోషనల్ అవుతూ చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి . అయితే ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఎంతో ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియో గురించి వర్ష అడగడంతో తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తనకు కొన్ని డేట్స్ చాలా సెంటిమెంట్ గా ఉంటాయని తెలిపారు. అక్టోబర్ 22వ తేదీ మా నాన్న చనిపోయారు అలాగే నవంబర్ 22వ తేదీ నా పుట్టిన రోజు. అలా నాన్న చనిపోయిన నెలకు సరిగా అదే రోజు నా పుట్టిన రోజు జరుపుకోవడం చాలా బాధగా అనిపించింది అందుకే కాస్త ఎమోషనల్ అయ్యానని తెలిపారు.

ప్రియాంక సింగ్ పుట్టినరోజు..

Advertisement

నాన్న అక్టోబర్ 22వ తేదీ మరణించడంతో నేను నవంబర్ 22వ తేదీ నా పుట్టిన రోజును జరుపుకోలేదు .నవంబర్ 22 సాయి తేజ పుట్టినరోజు కానీ అక్టోబర్ 5 ప్రియాంక సింగ్ పుట్టినరోజు అని తెలిపారు. ఈమె అక్టోబర్ 5వ తేదీ సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారడంతో అదే తన పుట్టినరోజు అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపోతే తన తండ్రితో తనకు ఉన్న అనుబంధం గురించి కూడా తెలిపారు. చిన్నదాన్నీ కావడంతో మా నాన్న చాలా బాగా చూసుకునేవారు కానీ నాన్నకు తెలియకుండా నేను సర్జరీ చేయించుకున్నానని, నాన్నకు కళ్ళు కనిపించకపోయినా నాన్నకు తెలియకుండా నేను తప్పు చేశాననే భావన నాలో ఉండేదని అందుకే నాన్నను కనీసం తాకడానికి కూడా ధైర్యం చేసేదాన్ని కాదని తెలిపారు.

Advertisement

నాన్న చివరి రోజుల్లో నాతోనే ఉన్నారని తెలిపారు. నాన్నకు క్యాన్సర్ అని లాస్ట్ స్టేజ్ లో తెలిసింది. అప్పుడు హైదరాబాద్ కు తీసుకువచ్చి నా దగ్గరే పెట్టుకున్నాను ఇక నాన్న చనిపోయే సమయంలో నా చేతుల్లోనే చనిపోయారని ఎమోషనల్ అయ్యారు. ఇక నాన్న చనిపోయే ముందు నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్త ధైర్యంగా ఉండు, డబ్బును సంపాదించుకో అంటూ నాకు చెప్పారని ఈమె ఎమోషనల్ అయ్యారు. నాన్న చనిపోయిన ఆరోజు నా జీవితంలో ఒక బ్లాక్ డే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తన తండ్రికి సర్జరీ విషయం బిగ్ బాస్ వేదిక ద్వారా తెలిసిందని ప్రియాంక సింగ్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read: Bandla Ganesh On Mowgli: మోగ్లీ సినిమాకు బండ్లన్న రివ్యూ.. అదే ఎక్కువైందంటూ!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×