E-Paper
Advertisement

Best Soaps For Skin: శరీర రంగును మార్చే సత్తా సబ్బుకు ఉందా?.. నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!

Best Soaps For Skin: శరీర రంగును మార్చే సత్తా సబ్బుకు ఉందా?.. నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!
Advertisement

Best Soaps For Skin: సబ్బులు సాధారణంగా చర్మంపై పేరుకుపోయే మురికి, చెమట, ఆయిల్‌ను తొలగించి శరీరానికి శుభ్రత, తాజాదనం అందిస్తాయి. కానీ చాలామందిలో ఉన్న ఒక కామన్ సందేహం ఏమిటంటే.. సబ్బు వాడితే నిజంగా చర్మం తెల్లగా మారుతుందా? అని. మార్కెట్లో ఫెయిర్‌నెస్, వైట్‌నింగ్ అంటూ వచ్చే సబ్బులు నిజంగా రంగు మార్చగలవా? లేక ఇవన్నీ కేవలం ప్రచారమా? అలాగే చర్మానికి హాని కలగకుండా మనం ఎంచుకోవాల్సిన సబ్బు ఏది? ఇలాంటి ఎన్నో సందేహాలకు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

పొడిచర్మం కోసం:

పొడిచర్మం ఉన్నవారు తేమను నిలుపుకోవడమే చాలా అవసరం. దీని కోసం అలోవేరా, కొబ్బరి నూనె, ఆల్‌మండ్, ఆలివ్ ఆయిల్, షియా/కోకో బటర్ వంటి పదార్థాలు ఉండే మాయిశ్చరైజింగ్ సబ్బులను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి చర్మాన్ని బిగుసుపోకుండా, పొలుసులుగా మారకుండా రక్షణ కల్పిస్తాయి. ఏ చర్మం వారైనా ముఖ్యంగా శీతాకాలంలో ఇలాంటి సబ్బులు వాడితే.. చర్మం మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Read Also: అధిక బరువును నియంత్రించే వెల్లుల్లి-తేనె మిశ్రమం.. రోజూ తిన్నారంటే షాకింగ్ రిజల్ట్స్!

సున్నిత చర్మం కోసం:

లిక్విడ్ ఫ్రీ క్లెన్సర్లు సున్నిత చర్మానికి మంచివి. గ్లిజరిన్, సెటైల్/స్టెరైల్ ఆల్కహాల్, ప్రొపిలిన్ గ్లైకాల్ ఉంటే తేమను కాపాడతాయి. ఓట్మీల్, గోట్స్ మిల్క్ వంటి సున్నిత పదార్థాలతో ఫ్రాగెన్స్ ఫ్రీ సబ్బులు ఉపయోగించాలి. కఠిన రసాయనాలు ఉన్న సబ్బులకు దూరంగా ఉండాలి. అలాగే హెర్బల్ సోప్స్ కూడా సున్నిత చర్మానికి మంచివే.

సాధారణ చర్మం కోసం:

Advertisement

కొబ్బరి నూనె, అలోవేరా వంటి సహజ పదార్థాలు ఉన్న సబ్బులు వాడితే సరి. ఇవి చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. సబ్బులు చర్మ రంగును మార్చవు అని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. రంగు ప్రధానంగా జన్యువుల ఆధారంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆహారం, జీవనశైలి చర్మం నిగనిగలాడేలా చేస్తాయి కానీ రంగు మార్చవు.

జిడ్డు చర్మం/మొటిమల కోసం:

ఇలాంటి చర్మం గలవారు గ్లైకోలిక్, సాలిసిలిక్ యాసిడ్, యాక్టివేటెడ్ చార్కోల్, టీ ట్రీ ఆయిల్ ఉన్న సబ్బులు ఉపయోగించాలి. వీటివల్ల ఆయిల్‌ తొలగి, స్వేద రంధ్రాలు శుభ్రం అవుతాయి. యాంటీ బాక్టీరియల్, లావెండర్, చమోమిలే, థైమ్ వంటి సబ్బులు కూడా మంచి ఎంపిక. మొటిమల చర్మం కోసం తేలికపాటి క్లెన్సర్ వాడాలి. అది కూడా డాక్టర్ల సలహా మేరకే ఉపయోగించాలని.

సబ్బు ఎంపికలో జాగ్రత్త:

మీరు సబ్బు కొనేటప్పుడు మీ చర్మానికి అనుగుణంగా ఎంచుకొని దీర్ఘకాలం వాడవచ్చు. టోటల్ ఫ్యాటీ మ్యాటర్ (TFM) కనీసం 76% ఉండే సబ్బులు బెస్ట్ ఆప్షన్. హానికర రసాయనాలు, స్ట్రాంగ్ డిటర్జెంట్లు, ఆల్కహాల్, పెట్రోలియం ఉత్పత్తులు, సల్ఫేట్లు, పారబెన్స్, కృత్రిమ రంగులు ఉన్న సబ్బులను అస్సలు వాడొద్దు. వీటిని వాడటం వలన చర్మం పొడిబారడమే కాకుండా.. డీహైడ్రేట్ కూడా అవుతుంది.

Read Also: బరువు పెరగడానికి కారణం భోజనం కాదు.. నిద్రలేమి సమస్యే అసలు విలన్ అంటున్న నిపుణులు!

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×