E-Paper
Advertisement

హేమక్క తప్పు చేశాను క్షమించు… బిగ్ బాస్ తమన్నా సింహాద్రి కామెంట్స్ వైరల్!

హేమక్క తప్పు చేశాను క్షమించు… బిగ్ బాస్ తమన్నా సింహాద్రి కామెంట్స్ వైరల్!
Advertisement

Tamanna Simhadri: తమన్నా సింహాద్రి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఈమె ట్రాన్స్ జెండర్ గా అందరికీ సుపరిచితమే అయితే బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న తమన్నా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే తాజాగా తమన్నా సింహాద్రి (Tamanna Simhadri)సోషల్ మీడియా వేదికగా ప్రముఖ నటి హేమ(Hema)కు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు.

డ్రగ్స్ కేసులో హేమకు క్లీన్ చిట్..

తమన్నా సింహాద్రి నటి హేమకు క్షమాపణలు చెప్పడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే.. ఏడాదిన్నర క్రితం నటి హేమ డ్రగ్స్ కేసు(Drugs Case)లో భాగంగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఓ పార్టీలో డ్రగ్స్ వాడారని, ఆ పార్టీలో పాల్గొన్న హేమ సైతం డ్రగ్స్ తీసుకున్నారని ఆమెకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది అంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు ఈ విషయంలో ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా హేమ డ్రగ్స్ కేసు వివాదంలో చిక్కుకోవడంతో మీడియా ఆమె గురించి ఎన్నో విమర్శలు చేశారు. అదేవిధంగా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హేమ తీరు పట్ల విమర్శలు కురిపించారు.

క్షమాపణలు కోరిన తమన్నా సింహాద్రి..

Advertisement

ఇక ఈ డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెబుతున్నప్పటికీ ఆమె గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంపై గతంలో తమన్నా సింహాద్రి కూడా నటి హేమను తప్పుపడుతూ మాట్లాడారు. కరాటే కళ్యాణి తమన్నా సింహాద్రి హేమ గురించి మీడియాతో కలిసి విమర్శలు కురిపించారు. ఆ సమయంలో హేమ వీరిద్దరిపై పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే ఈ కేసు విషయంలో హేమ తప్పు ఏమాత్రం లేదని బెంగళూరు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా హేమ తప్పు లేదనే విషయం తెలియడంతో తాజాగా తమన్నా సింహాద్రి నటి హేమకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు.

?igsh=MXcyZjEwZjNtdTRkMg%3D%3D

Advertisement

ఈ వీడియోలో భాగంగా తమన్నా సింహాద్రి మాట్లాడుతూ.. హేమా అక్క ఒకానొక సమయంలో మీడియా మొత్తం మీ మీద బురద చల్లి మాట్లాడారు. అయితే ఆ సమయంలో మేము మీకు మద్దతుగా ఉండాల్సింది పోయి మీడియాతో పాటు మీపై నేను కూడా బురద చల్లాను. మీ విషయంలో మేము అలా వ్యవహరించి ఉండకూడదు ఆరోజు మీ వైపు నిలబడకుండా తప్పు చేశాను నన్ను క్షమించు హేమక్క అంటూ ఈ సందర్భంగా తమన్న సింహాద్రి గతంలో హేమ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు. మరి తమన్నా సింహాద్రి చేసిన ఈ వ్యాఖ్యలపై హేమ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇక హేమ కోర్టు నుంచి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మీడియాపై అవకాశం దొరికిన ప్రతిసారి విమర్శలు కురిపిస్తూ నిజాలు తెలుసుకొని వార్తలను ప్రచారం చేయమని కోరుతున్న సంగతి తెలిసిందే.

Also Read: బెల్జియం రేసులో సత్తా చాటిన అజిత్ కుమార్.. దేశానికే గర్వకారణం..

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×