E-Paper
Advertisement

బెల్జియం రేసులో సత్తా చాటిన అజిత్ కుమార్.. దేశానికే గర్వకారణం..

బెల్జియం రేసులో సత్తా చాటిన అజిత్ కుమార్.. దేశానికే గర్వకారణం..
Advertisement

Ajith Kumar : కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అజిత్ కుమార్ ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.. సినిమాలంటే ఏ విధంగా అయితే అజిత్ కుమార్ కు ఇష్టమో అదే విధంగా రేసింగ్ అంటే కూడా ప్రాణం పెట్టేస్తారు. ఇప్పటికే ఈయన వివిధ దేశాలలో రేసింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా అజిత్ కుమార్ సహ యజమానిగా ఉన్న తన రేసింగ్ టీం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది.బెల్జియంలోని ప్రఖ్యాత స్పే ఫ్రాంకోర్‌చాంప్స్ సర్క్యూట్‌లో జరిగిన మిచెలిన్ 12H రేసులో అజిత్ కుమార్ రేసింగ్ టీం పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన అజిత్ టీం..

ఈ రేసింగ్ లో భాగంగా అజిత్ టీం రెండో స్థానంలో నిలిచి పోడియంను కైవసం చేసుకుంది. ఇలా అజిత్ అండ్ టీం రెండో స్థానంలో నిలవడంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక రెండో స్థానంలో అజిత్ టీం పోడియం కైవసం చేసుకోవడంతో భారతీయ జెండాను ఎగరవేస్తూ ఈ విజయాన్ని సంతోషంగా జరుపుకున్నారు. ఈ విధంగా అజిత్ టీం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలవడంతో మోటార్‌స్పోర్ట్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బెల్జియం రేసులో రెండో స్థానం కైవసం..

Advertisement

2025 మిచెలిన్ 24H సిరీస్ యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ పోటీ జరిగింది. ఏప్రిల్ 19, 20 తేదీల్లో రెండు భాగాలుగా నిర్వహించారు. ఇక అజిత్ ఇలాంటి అంతర్జాతీయ రేసింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో విజయం సాధించడం ఈయనకు మొదటిసారి కాదు ఇదివరకే దుబాయ్‌లో జరిగిన 24H రేసులో, ఇటలీలోని ముగెల్లోలో జరిగిన 12H రేసులోనూ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు బెల్జియంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

?igsh=MWZma3pnNmowOG9tZg%3D%3D

Advertisement

ఇలా అజిత్ టీం మరో విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అజిత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా గుడ్ బాడ్ అగ్లీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది . ఇకపోతే తాజాగా అజిత్ కుమార్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం షూటింగ్ పనులను కూడా జరుపుకుంటుంది. ఇలా ఒక వైపు సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతూనే అజిత్ మరోవైపు రేసింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో సత్తా చాటుతూ భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని చెప్పాలి.

Also Read: మంగ్లీ అనుచరుల నుంచి ప్రాణహాని.. ఆవేదన చెందిన అడ్వకేట్ సుబ్బారావు!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×