E-Paper
Advertisement

అవకాశాలు రాని వారికి అండగా చదలవాడ.. దర్శకుల సంఘంలో కొత్త విప్లవం.. రూ. 30 కోట్లతో భారీ ప్రాజెక్ట్!

అవకాశాలు రాని వారికి అండగా చదలవాడ.. దర్శకుల సంఘంలో కొత్త విప్లవం.. రూ. 30 కోట్లతో భారీ ప్రాజెక్ట్!
Advertisement

Chadalavada Srinivasa rao:తెలుగు సినీ ఇండస్ట్రీ హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ చదలవాడ శ్రీనివాసరావు. అవును.. సక్సెస్ లో ఉన్నప్పుడు ఎవరైనా పిలిచి సినిమాలు ఇస్తారు. కాని నేను అసలు అవకాశం రాని వాళ్లని పిలిచి సినిమాలు ఇస్తానంటూ తీసుకున్న డిసీషన్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. హిట్టే మాట్లాడే ఈ ఇండస్ట్రీలో ఇలా లాభ నష్టాలని బేరీజు వేసుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మెచ్చుకోతగ్గ విషయం.

దర్శకుడు అనేవాడు సినిమాకి వెన్నెముక

Advertisement

తాజాగా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం (TFDA) ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్‌లో చదలవాడ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన ఛాన్స్ లు రావట్లేదని, అలాంటి వారిని గుర్తించి వాళ్లకి సరైన అవకాశం ఇచ్చి ప్రోత్సహించడమే మా లక్ష్యమని చెప్పుకొచ్చారు. దర్శకుడు అనేవాడు సినిమాకి వెన్నెముక అని, అటువంటి క్రియేటివిటీ కలిగిన వ్యక్తులు అవకాశాలు లేక ఇబ్బంది పడటం ఇండస్ట్రీకి మంచిది కాదని ఈ డిసీషన్ తీసుకున్నట్టు తెలిపారు.

also read:ప్రకాష్ రాజ్ వర్సెస్ సోషల్ మీడియా.. రాముడిపై వ్యాఖ్యలా? ఇక సినిమాల్లో నో ఛాన్స్!.. పాన్ ఇండియా లెవల్లో ‘బ్యాన్’ సెగ!

Advertisement

ఏకంగా రూ. 30 కోట్ల భారీ బడ్జెట్‌

అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 30 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించి ఒక్కో సినిమాకి సగటున 3 కోట్లతో 10 సినిమాలు నిర్మిస్తామని చెప్పడం విశేషం. అంటే దర్శకుల సంఘంలోని సభ్యులై ఉండి మంచి సినిమాలు తీయగలిగి అవకాశాలు రాని వారికి ఇదో గోల్డెన్ ఛాన్స్ అన్నమాట. మరో వైపు ఈ 10 సినిమాల ద్వారా సుమారు 10 మంది దర్శకులకు లైఫ్ దొరకడమే కాకుండా, వందలాది మంది సినీ కార్మికులకు ఉపాధి లభిస్తుంది కూడా.

మాతృదేవోభవ’ తీసిన  అజయ్ కుమార్ పెద్దగా 

ఇక దీనికొక కమిటీ వేసి దానికి ‘మాతృదేవోభవ’ వంటి అద్భుతమైన క్లాసిక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ దర్శకుడు అజయ్ కుమార్ ని పెద్దగా నియమించారు. అంటే ఇక దర్శకుల సంఘంలోని సభ్యులు ఎవరైనా మంచి కథలతో సినిమాలు తీయాలని అనుకున్నా ఈ కమిటీని సంప్రదించి ఒప్పించి సినిమా తీసేయొచ్చు అన్న మాట. ఏది ఏమైనా ఇక ప్రకటించేశాం గా అని పక్కన పడేయకుండా ఒక కమిటీ వేయడం, అన్నీ వాళ్లకే అప్పగించడం బట్టి చూస్తే చదలవాడ ఈ నిర్ణయంపై ఎంత ఫోకస్డ్ గా ఉన్నారో అర్థమవుతుంది.

ఏది ఏమైనా టాలెంట్ ఉన్న వ్యక్తులకి సరైన అవకాశాలు రావాలంటూ చదలవాడ శ్రీనివాసరావు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మందికి దారి చూపిస్తుందనడంలో సందేహమే లేదు. చూడాలి మరి చదలవాడ తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్ తో ఎంత మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందో!

also read:ఉత్తరాంధ్రలో ‘పెద్ది’ ఊచకోత షురూ.. 23 కోట్లతో చరణ్ రేంజ్ మామూలుగా లేదుగా!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×