E-Paper
Advertisement

IBomma Ravi: ఐబొమ్మ రవి జర్నీపై సినిమా… ఇప్పుడు ఆ మూవీని కూడా పైరసి చేస్తారా?

IBomma Ravi: ఐబొమ్మ రవి జర్నీపై సినిమా… ఇప్పుడు ఆ మూవీని కూడా పైరసి చేస్తారా?
Advertisement

IBomma Ravi: సినిమా అంటే కొందరికి వ్యాపారం, ఇంకొందరికి వ్యాపకం, చాలా తక్కువ మందికి జీవితం. సినిమాను జీవితంగా భావించే వాళ్ళకి ఎప్పటికీ ఒక సంపూర్ణమైన గౌరవం ఉంటుంది. అయితే అన్ని పనులు అందరికీ నచ్చాలి అని రూల్ లేదు. ఒకరి దృష్టిలో రైట్ అనుకునది ఇంకొకరు దృష్టిలో రాంగ్ అవుతుంది. అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి విపరీతమైన నష్టం తీసుకొచ్చాడు ఇమ్మడి రవి అనే ఒక వ్యక్తి.

సినిమా రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే చాలా సినిమాలను నెట్ లో పెట్టేసాడు. దానివలన సినిమాకి వచ్చే ఆడియన్స్ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వాస్తవానికి ఓటిటీ వచ్చిన తర్వాతే సినిమాకి వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయింది. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు కూడా గంటల వ్యవధిలో ఆన్లైన్లో ప్రత్యక్షమవుతుంటే ఇంకా థియేటర్ కి ఎవరు వస్తారు. మొత్తానికి సినిమాలు పైరసీ చేసే ఇమ్మడి రవి అనే ఒక వ్యక్తిని తెలంగాణ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.

Advertisement

సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా అతనిదే అసలైన టాపిక్. కొంతమంది అతనికి దేవుడు అంటూ ఎలివేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. మరికొంతమంది ఠాగూర్ సినిమాలోని సీన్స్ అప్లై చేస్తూ బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చారు. కానీ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఫ్రీగా సినిమా చూస్తున్నాము అనుకున్నారే తప్ప తన డేటాను ఇంకొకరికి అప్పచెబుతున్నాము అని తెలియని పరిస్థితిలో ఉన్నారు.

రవి జర్నీ పై సినిమా 

ప్రతి ఒక్కడు ఒక పని చేశాడు అంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక ఆసక్తికర సంఘటన జరిగి ఉంటుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది. రవి విషయానికి వస్తే వాళ్ల భార్య మరియు అత్త చేసిన కొన్ని విషయాల వలనే తాను అలా తయారయ్యాను అని చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే ఇది కొంచెం ఆసక్తికరంగా అనిపించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని కొంతమంది ఇతను జర్నీ పై సినిమా చేయాలి అని ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజులుగా SMలో ఎక్కడ చూసినా iBOMMA.. ఇమ్మడి రవి’ గురించే చర్చ జరుగుతోంది. దీంతో ఆయన జీవితంపై సినిమా తీసేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది.

‘ఇమ్మడి రవి జీవితంలో జరిగిన వాస్తవాలు, ఆయన చేసిన పోరాటం, ఎదుర్కొన్న వెన్నుపోట్ల గురించి సినిమా తీయబోతున్నాం. రవి, అతని టీమ్ గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటి విషయాలు చూపిస్తాం’ అని ‘తేజ్ క్రియేటివ్ వర్క్స్’ అనే నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ఆ మూవీ ని పైరసీ చేస్తారా?

సామాన్య ప్రజలకు కొన్ని విషయాలు అర్థం కావడం లేదు అంటే ఒక రకంగా ఉంటుంది. అతని వలన సినిమా పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి వ్యక్తి మీద ఈరోజు సినిమా తీసే పరిస్థితి ఏర్పడుతుంది.

ఒకవేళ అదే సినిమాకి అసలు డబ్బులు రాకుండా పైరసీ చేస్తే నిర్మాతల పరిస్థితి ఏమవుతుంది అనే కామెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఏదేమైనా దీనిమీద ఇండస్ట్రీ నుంచే ముఖ్యంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని జరుగుతాయి కాని తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ అయితే నిర్మొహమాటంగా ఆ నిర్మాణ సంస్థను బ్యాన్ చేస్తుంది. మరి ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.

Also Read: Divya Bharathi: నాకెవరితో ప్రాబ్లం లేదు, ఆ దర్శకుడు హద్దులు దాటుతున్నాడు

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×