E-Paper
Advertisement

Fake Reviews Rating: ఇక నో ఫేక్ రేటింగ్స్.. నో ఫేక్ రివ్యూ… చిరు మూవీ నుంచే కొత్త ప్రయోగం

Fake Reviews Rating: ఇక నో ఫేక్ రేటింగ్స్.. నో ఫేక్ రివ్యూ… చిరు మూవీ నుంచే కొత్త ప్రయోగం
Advertisement

Fake Reviews Rating: ఇటీవల కాలంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందంటే ఆ సినిమా సక్సెస్ అవ్వాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా సినిమాని తొక్కేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక స్టార్ హీరో సినిమా విడుదల అయింది అంటే యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆ సినిమాకు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారాలు మొదలు పెడుతూ, సినిమాకు కావలసిన డ్యామేజ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి నెగెటివిటీ సినిమా బుకింగ్ పార్ట్నర్ ద్వారా చాలామంది పెద్ద ఎత్తున స్కామ్ చేస్తూ సినిమాకు నెగిటివిటీని పెంచుతూ ఉంటారు.  ఇన్ని రోజులపాటు బుకింగ్ పార్ట్నర్  ఇచ్చే రేటింగ్స్ ద్వారా సినిమా బజ్ ఏంటో స్పష్టమయ్యేది.

నెగిటివ్ రివ్యూలకు నో ఛాన్స్..

ఈ బుకింగ్ పార్ట్నర్ ద్వారా కూడా ఈ యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి ఉద్దేశపూర్వకంగానే నెగిటివ్ రివ్యూలను, నెగిటివ్ రేటింగ్ ఇచ్చేలా చేస్తుంటారు. అదేవిధంగా కొంత డబ్బును చెల్లించి నెగిటివ్ కామెంట్లను కూడా వేయించేవారు. ఇలాంటి వాటి ద్వారా సినిమాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేది. ఇలాంటి చర్యలకు అడ్డుకట్టు వేయటం కోసమే రెండు యాంటీ పైరసీ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ‘బ్లాక్ బిగ్ ‘ ‘అప్లిక్స్’ వంటి యాప్స్ ద్వారా ఈ నెగెటివిటీకి చెక్ పెట్టబోతున్నారు. ఈ యాప్స్ ద్వారా ఇకపై సినిమాలకు ఫేక్ రివ్యూ, ఫేక్ రేటింగ్ ,ఫేక్ కామెంట్స్ ఇవ్వటానికి వీలు లేకుండాపోయింది.

చిరంజీవి సినిమా నుంచి ప్రయోగం..

Advertisement

ఈ రెండు యాప్స్ ఉపయోగించటం వల్ల బుకింగ్ పార్ట్నర్ రేటింగ్ విషయంలో మార్పులు చేయటానికి వీలు ఉండదు. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభించిందో కేవలం వారి స్పందన ఆధారంగా రివ్యూ ఇవ్వటానికి వీలు ఉంటుంది. ఇక ఈ విధానం చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి అమలు కాబోతుండటం విశేషం. ఈ సరికొత్త విధానం అమలులోకి రావడం చిరంజీవి సినిమాకు చాలా వరకు మేలు కలుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇలా ఈ యాప్స్ ద్వారా సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీని పూర్తిగా అరికట్టడంతో నిర్మాతలకు కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది.

ఆ నిర్మాతలకు ఝలక్..

Advertisement

ఇకపోతే ఈ విధానం అమలులోకి రావటం వల్ల కొంతమంది నిర్మాతలకు ఇబ్బందికరంగా కూడా మారుతుందని చెప్పాలి. కొంతమంది నిర్మాతలు తమ సినిమాలకు  సరైన స్పందన లేకపోయినప్పటికీ కొన్ని డీలింగ్స్ ద్వారా ఈ బుకింగ్ యాప్స్ లో అత్యధిక రేటింగ్ వేయించుకోవడం జరుగుతుంది. తద్వారా తమ సినిమాకు పాజిటివ్ బజ్ ఉందంటూ సినిమాని ప్రమోట్ చేసుకునేవారు. ఇకపై ఇలాంటి స్కాం చేయడానికి కూడా అవకాశం ఉండదని చెప్పాలి. సినిమా విడుదలైన తర్వత ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అదే ఒరిజినల్ రివ్యూగా ప్రకటించబడుతుంది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ కొత్త విధానం చిరంజీవి సినిమా నుంచి మొదలు కావడం విశేషం.

Also Read: Allu Arjun fans::నువ్వు AA అయితే.. నేను VV.. శ్రీవిష్ణుపై బన్నీ ఫ్యాన్స్ అలక!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×