E-Paper
Advertisement

Cyber crime: మాజీ ఐపీఎస్ అధికారి దంపతులకు సైబర్ టోకరా.. ఏకంగా రూ. 2.58 కోట్లు స్వాహా!

Cyber crime: మాజీ ఐపీఎస్ అధికారి దంపతులకు సైబర్ టోకరా.. ఏకంగా రూ. 2.58 కోట్లు స్వాహా!
Advertisement

ఉన్నత విద్యావంతులు, సమాజంపై అవగాహన ఉన్న వ్యక్తులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సామాన్యులనే కాకుండా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను కూడా బురిడీ కొట్టించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో సాగించిన ఈ భారీ మోసంలో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్య ఏకంగా రూ. 2.58 కోట్లు కోల్పోయారు.

వాట్సాప్ గ్రూపుతో వల..

Advertisement

ఈ మోసానికి బీజం ఒక వాట్సాప్ సందేశంతో పడింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అదిరిపోయే లాభాలు వచ్చే చిట్కాలు ఇస్తామంటూ బాధితురాలికి సందేశం వచ్చింది. తనకు ట్రేడింగ్‌పై అంతగా అవగాహన లేకపోవడంతో.. ఆమె తన భర్తను (రిటైర్డ్ ఐపీఎస్ అధికారి) కూడా సదరు వాట్సాప్ గ్రూపులో చేర్పించారు. గ్రూపులోని సభ్యులు తాము పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు నకిలీ స్క్రీన్ షాట్లు పెట్టి వీరిని నమ్మించారు.

నమ్మించిన సెబీ సర్టిఫికెట్లు..

Advertisement

బాధితులకు అనుమానం కలగకుండా ఉండేందుకు సైబర్ కేటుగాళ్లు పక్కా స్కెచ్ వేశారు. తాము సెబీ (SEBI) గుర్తింపు పొందిన వెబ్‌సైట్ నడుపుతున్నామని చెబుతూ.. కొన్ని నకిలీ సర్టిఫికెట్లను వాట్సాప్‌లో పంపించారు. ఆ సర్టిఫికెట్లు అసలైనవిగా నమ్మిన దంపతులు, తమ వద్ద ఉన్న భారీ సొమ్మును పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నారు.

19 లావాదేవీల్లో కోట్లాది రూపాయలు..

గత ఏడాది డిసెంబర్ 24వ తేదీ నుంచి ఈ నెల (జనవరి) 5వ తేదీ వరకు కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే బాధితులు 19 విడతలుగా మొత్తం రూ. 2.58 కోట్లను నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. వారు పంపిన నకిలీ వెబ్‌సైట్ లింక్‌లో బాధితుల ఖాతాలో లాభాలు వెయ్యి శాతం పెరిగినట్లు గ్రాఫిక్స్ రూపంలో చూపించడంతో, ఇది నిజమేనని బాధితులు భ్రమపడ్డారు.

బెదిరింపులకు దిగిన నేరగాళ్లు..

కొంతకాలం తర్వాత తాము పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలని బాధితులు భావించారు. అయితే.. డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే మరిన్ని నిధులు జమ చేయాలని నేరగాళ్లు ఒత్తిడి తెచ్చారు. ఇన్వెస్ట్‌మెంట్ ఆపేస్తే ఇప్పటివరకు పెట్టిన డబ్బు మొత్తం పోతుందని.. ఐటీ దాడులు జరుగుతాయని బెదిరింపులకు దిగారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వాడిన బ్యాంక్ ఖాతాలను, వాట్సాప్ నంబర్లను ట్రాక్ చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇచ్చే స్టాక్ మార్కెట్ చిట్కాలను నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని, అధిక లాభాల ఆశ చూపే యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ: Benefits of Warm Water: రోజంతా శరీరం ఉత్సాహంగా ఉండాలంటే.. నిద్రలేవగానే ఈ ఒక్క పనిచేస్తే చాలు!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×