E-Paper
Advertisement

Bollywood: హాస్పిటల్లో చేరిన మరో నటుడు..61 ఏళ్ల వయసులో

Bollywood: హాస్పిటల్లో చేరిన మరో నటుడు..61 ఏళ్ల వయసులో
Advertisement

Bollywood:సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం హాస్పిటల్ పాలైన ధర్మేంద్ర (Dharmendra ) ఏకంగా చావు వార్తలను కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఆయన నేడు ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇంతలోపే మరో బాలీవుడ్ నటుడు హాస్పిటల్ పాలవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తమ అభిమాన హీరోలకే ఇలా జరుగుతోంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నటుడు గోవిందా (Govinda ) తాజాగా హాస్పిటల్ పాలైనట్టు సమాచారం. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న గోవింద.. ముంబై క్రిటికేర్ హాస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు ధర్మేంద్రను నిన్న హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన గోవిందా.. ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారట. దీంతో అర్థరాత్రి ఒంటిగంటకు హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ మీడియాతో తెలిపారు.

Advertisement

ఆయనకు పలు టెస్టులు చేశారని.. వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి గల కారణం తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే నటుడుని పరామర్శించడానికి వెళ్ళిన గోవిందా ఇలా ఉన్నట్టుండి హాస్పిటల్ పాలవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ నటుడి గోవింద వయసు 61 సంవత్సరాలు కావడం గమనార్హం.

ఇకపోతే గోవిందా హాస్పిటల్ పాలైనట్లు వార్తలు రావడంతో అభిమానులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు . ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి చూసి కలవరపాటుకు గురై వుంటారు. అదే ఆయనను ఇలా హాస్పిటల్ పాలయ్యేలా చేసింది అంటూ ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా గోవిందా త్వరగా డిశ్చార్జ్ కావాలి అని ఆయన ఆరోగ్యం కుదుటుగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

ALSO READ:Modi Biopic: మోదీ బయోపిక్ లో కేజీఎఫ్ బ్యూటీ.. ఏ పాత్రకో తెలుసా?

గోవిందా కెరియర్..

గోవిందా అసలు పేరు గోవిందా అరుణ్ ఆహుజా 1963 డిసెంబర్ 21న జన్మించిన ఈయన నటుడు మాత్రమే కాదు రాజకీయ నాయకుడు కూడా.. 120కి పైగా హిందీ భాషా చిత్రాలలో నటించిన ఈయన.. 1990లో తన స్లాప్ స్టిక్ ప్రదర్శనలతో.. నృత్య నైపుణ్యాలతో భారీ పాపులారిటీ అందుకున్నారు. 12 ఫిలింఫేర్ అవార్డులకు నామినేషన్లు అందుకున్న గోవింద.. రెండు ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డులతో పాటు ఉత్తమ హాస్యనటుడిగా ఫిలింఫేర్ అవార్డును దక్కించుకున్నారు.

నటుడు మాత్రమే కాదు రాజకీయ నేత కూడా..

గోవిందా 2004 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు ఐదుసార్లు అధికారంలో ఉన్న వ్యక్తిపై ఏకంగా 50 వేల ఓట్ల మెజారిటీతో ముంబై నుండి లోక్సభ భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో తన అజెండా రవాణా ఆరోగ్యం విద్య అని చెప్పిన ఆయన రవాణా రంగంలో పశ్చిమ రైల్వే జోన్ లోని బోరివలి విరార్ విభాగాన్ని నాలుగు రెట్లు పెంచడంలో 80 శాతం క్రెడిట్ ను దక్కించుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యం విద్యా రంగాలలో ఎంతో కృషి చేశారు అంతేకాదు వాసాయి విరారు లో అంగన్వాడీలను నిర్మించి తాగునీటి సమస్యలను కూడా పరిష్కరించడానికి ఎంతో పాటుపడ్డారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×