BigTV English

Bollywood Hero: కేక్‌లో మందు బాటిల్.. ఎవరి కంట పడకుండా కొట్టేసిన సీనియర్ హీరో..

Bollywood Hero: కేక్‌లో మందు బాటిల్.. ఎవరి కంట పడకుండా కొట్టేసిన సీనియర్ హీరో..

Bollywood Hero : బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. దాంతో ఇక్కడ కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. `కేజీఎఫ్` తో సౌత్ ఇండ‌స్ట్కీకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ‘కేజీఎఫ్ 2’ లో బ‌ల‌మైన విల‌న్ పాత్ర పోషించి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అక్క‌డ స‌క్సెస్ తో టాలీవుడ్ లోనూ అవ‌కాశాలు అందుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినినే హీరోగా న‌టించిన ‘డ‌బుల్ ఇస్మార్ట్’ లోనూ విల‌న్ గా న‌టించారు. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఈయన ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. ఇటీవల ఓ పార్టీ కి వెళ్లిన ఆయన మందు బాటిల్ ను కొట్టేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..


దొంగగా మారిన బాలీవుడ్ హీరో.. 

ఇటీవల ఓ పార్టీకి వెళ్లిన ఆయన అక్కడ ఫోటో గ్రాఫర్స్ స్టిల్స్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన కేకులో ఉన్న మందు బాటిల్ ను చూసాడు. వెంటనే దాన్ని తీసుకొని జేబులో పెట్టుకొనే ప్రయత్నం చేశాడు. కెమెరాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయి అలా మందు బాటిల్ కొట్టేయడం అక్కడ కెమెరాలకు చిక్కింది. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అది చూసిన ఆయన అభిమానులు, అలాగే నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి ఇదేం పాడు అలవాటు. చిన్న మందు బాటిల్ కోసం కక్కుర్తి పడటం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..


Also Read:అనుష్క ‘ఘాటి’కి రిలీజ్ కష్టాలు.. మరోసారి వాయిదా..?

సంజయ్ సినిమాల విషయానికొస్తే.. 

ప్రస్తుతం ఈయన చేతిలో అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. అందులో గాడ్ ఆఫ్ మాసెస్ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `అఖండ‌2` లోనూ ద‌త్ విల‌న్ గా చేస్తున్నారని టాక్.. మెగా మేన‌ల్లుడు హీరోగా న‌టిస్తోన్న ‘సంబ‌రాల ఏటిగ‌ట్టు’లో కూడా సంజ‌య్ ద‌త్ ని విల‌న్ గా తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే ద‌ర్శకుడు రోహిత్ కెపి ద‌త్ ని క‌ల‌సి స్టోరీ వినిపించ‌డంతో పాటు మంచి పారితోషికం ఆఫ‌ర్ చేయ‌డంతో ఓకే చెప్పినట్లు టాక్. బాలీవుడ్ స్టార్ హీరోలే తెలుగు సినిమాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ద‌త్ నే అవ‌కాశాలు వెత‌క్కుంటూ వెళ్ల‌డం అన్న‌ది అత‌డికే చెల్లింది.. గతేడాది బాలీవుడ్ లో ఈయన చేసిన యానిమల్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. అందులో కూడా ఆయన నటిస్తున్నారు. అంతే కాదు బాలీవుడ్ లో మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆ సినిమాలను ప్రకటించే అవకాశం ఉంది..

Related News

Aamir Khan: నడిరోడ్డుపై అమీర్ ఖాన్ ప్రేయసి అసహనం.. ప్రైవసీ కావాలంటూ?

Anaganaga Oka Raju: మన రాజు గారు సంక్రాంతికి వచ్చేస్తున్నారు

OG Collections: పవన్ కళ్యాణ్‌‌ కెరీర్‌లో ఫస్ట్ టైం… కలెక్షన్లతో దుమ్ము లేపుతున్న ఓజీ

Disaster OG: కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా

OG Movie: సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Big Breaking: ప్రముఖ డైరెక్టర్ తల్లి మృతి.. ఎలా జరిగిందంటే?

Zubeen Garg: స్టార్ సింగర్ మృతి.. మ్యూజీషియన్ అరెస్ట్.. మరణంపై ఎన్నో అనుమానాలు!

Avatar 3 Trailer: అవతార్ 3 కొత్త ట్రైలర్ రిలీజ్.. జేమ్స్ ఇండియాకి వచ్చారా?

Big Stories

×