AP Politics: అవినీతి ఆరోపణలు, లక్షల రూపాయలు వసూలు చేశాడన్న ఆరోపణలతో అడ్డంగా బుక్కయ్యారు… ఆ ఆరోపణలు నిజం కాదంటూ.. తమ బ్యాంకు అకౌంట్లలో సదరు నగదు జమైన విషయం నిజంగా కాదని.. కావాలంటే అకౌంట్స్ తనిఖీ చేసుకోవచ్చని మీడియా ముందు కొచ్చి చెప్పి తన గొయ్యి తానే తవ్వుకున్నాడంటూరు. ఎవరో ఇద్దరు మధ్య జరిగిన ఆ స్కాంకు సంబంధించిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ముఖ్య అనుచరుడు హరీష్ యాదవ్ చెప్పుకుంటున్నాడు. తనకు సంబంధం లేకపోతే ఎందుకు వివరణ ఇచ్చుకున్నాడు?. దానికి సంబంధించి లీకైన ఫోన్ కాల్ సంభాషణలో అతను ఎందుకు మాట్లాడాడు?..
జీడీ నెల్లూరులో ఫోన్ కాల్‌తో బుక్ అయిన హరీష్ రావు
గత వారం రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు సంచలనంగా మారాయి. ఓ అడియో కాల్ బయటకు రావడంతో చర్చ మొదలయింది. అడియో కాల్‌లో జీడి నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ అనుంగు అనుచరుడు అయిన హారీష్‌యాదవ్ వాయిస్‌తో పాటు ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన టీడపీ నాయకుడు క్వారీ యజమాని వెంకటేశ్వర్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణలో యాభయి లక్షల రూపాయలు చేతులు మారిన వ్యవహారం సంచలనంగా మారింది. సదు వివాదం నడుస్తుండగానే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రంలో మండలంలో అక్రమంగా పలుచోట్ల గ్రావెల్ తవ్వుతున్న దందా బయటకు వచ్చింది. గత మూడు నెలలుగా అధికార యంత్రాగం కల్లు అప్పగించి చూస్తుండగానే ఈ వ్యవహారం నడిచిందని టీడీపీ వర్గాలు సోషియల్ మీడియాలో అరోపణలు చేశాయి. అక్రమ రవాణా విజువల్స్ సైతం డ్రోన్ ద్వారా చిత్రీకరించి పార్టీ అధిష్టానానికి పంపారు.
దందాలు చేస్తున్న వారు టీడీపీ వారు కాదంటున్న తమ్ముళ్లు
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న వివాదాల్లోని కీలక వ్యక్తులు టీడీపీ వారు కాదని తమ్ముళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీ నాయకుల ముఖ్య అనుచరులు ఏన్నికల తర్వాత వచ్చి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అయిన థామస్ వద్దకు చేరి కీలక వ్యక్తులుగా మారి దందాలు నడుపుతున్నారంట. వారిలో హారీష్‌యాదవ్ గతంలో వైసీపీలో కీలక వ్యక్తి. చిత్తూరు వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అయిన విజయానందరెడ్డి అనుచరుడంట. మాజీ ఎమ్మెల్యే దందాలన్ని గతంలో అతనే నడిపాడంట. మరొకరు శరవణ్. తమిళనాడుకు చెందిన మట్టి వ్యాపారి. అతను గతంలో నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా అనుచరుడిగా అక్రమ మట్టి దందాలన్నీ నడిపాడంట.
తిరుపతికి చెందిన జైన్ రాందేవ్
ఇక వారితో పాటు టీడీపీ పంచకు చేరిన జైన్ రాందేవ్ తిరుపతి కి చెందిన వ్యక్తి .. చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు పెద్దిరెడ్డి వద్ద అనుంగు అనుచరుడిగా ఉంటు గ్రానైట్ దందాలను నడిపాడు.. మరొకరు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి చంద్ర..ఇతను గతంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే వద్ద పనిచేసాడు. ఆ సమయంలో ఇబ్బందులు సృష్టించి వైరి వర్గాలకు కోవర్టుగా వ్యవహరించాడంట ..అతనిని కూడా వైపీనీ నేతలే థామస్ వద్దకు చేర్చారని నియోజక వర్గంలో ప్రచారం జరుగతోంది. వారికి తోడు లోకేష్ యువగళం పాదయాత్రలో ఇబ్బందులు సృష్టించిన ఇద్దరు పోలీసు అధికారులను ఎమ్మెల్యే ఏరికోరి తన నియోజకవర్గంలో వేయించుకున్నారంట. వారందరూ కలిసి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న గ్రావెల్ సహా అన్ని అక్రమ దందాలు నడుపుతున్నారని టిడిపి శ్రేణులు సీఎంకు ఫిర్యాదు చేశాయంట. సీఎం సైతం జిడినెల్లూరులో జరిగిన బహిరంగ సభలో వైసీపీ వారికి సహాయసహకారాలు అందిస్తేపాముకు పాలు పోసి నట్లు అవుతుందని హెచ్చరించారు. అయితే ఎమ్మెల్యే థామస్ ..ఐ డోంట్ కేర్ తనకు ఆ నలుగురు కావాలన్న వ్యవహరిస్తుండటం జీడి నెల్లూరు తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదంట.
మీడియా సమావేశంలో అర్థం లేని వివరణ ఇచ్చిన హరీష్
దీనికి తోడు యాబై లక్షల వ్యవహారంపై వివరణ ఇవ్వడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు హారీష్ యాదవ్, రాందెవ్‌లు. తలా తోకా లేకుండా వివరణ ఇచ్చుకుని తాము బుక్ కావడమే కాకుండా, ఎమ్మెల్యేను సైతం బుక్ చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో హారీష్ మాట్లాడుతూ ఎమ్మల్యే ఆదేశాలతో తన సమక్షంలో పంచాయితీ జరిగిందని అంటూ ఎవరికి అర్థం కాకుండా వివరణ ఇచ్చాడు.
Also Read: చిక్కుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి
ఆ నలుగురి వల్ల పార్టీ నష్టపోతోందంటున్న తమ్ముళ్లు
అసలు ఎందుకు పంచాయితీ చేశారో చెప్పామంటే రాందెవ్ తనది క్వారీ అంటున్నారు. మొత్తం మీదాఆ నలుగురు ఎమ్మెల్యేను ఏలా ప్రభావితం చేసారో అర్థం కావడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఐదు సంవత్సరాలలో వైసీపీకు వచ్చిన చెడ్డపేరు ఏడాదిలోగా వీరి వల్ల తమ పార్టీకి వచ్చిందని వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైన ప్రత్యక దృష్టి సారించి, ఆ దుష్టచతుష్టయం నుంచి తమ నియోజకవర్గాన్ని కాపాడాలని మొర పెట్టుకుంటున్నారు జీడి నెల్లూరు తెలుగు తమ్ముళ్లు.