Ghaati Movie: టాలీవుడ్ జేజమ్మ అనుష్క ఈ మధ్య సినిమాలు ఎక్కువ చెయ్యడం లేదు. తెలుగులో గత కొన్నేళ్లుగా హిట్ సినిమా పడలేదు. ఆ మధ్య నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేసింది.. ఆ తర్వాత ఇప్పటివరకు సినిమాలు చేయలేదు ప్రస్తుతం ఘాటి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది అనుష్క శెట్టి. డిఫరెంట్ కథతో యాక్షన్ మూడ్లో రాబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లు పోస్టర్లు భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే ఈ మూవీ వాయిదా పడుతూనే వస్తుంది. ఈనెల 11 న రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కానీ ఇది మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది..
అనుష్క ‘ఘాటి’కి రిలీజ్ కష్టాలు..?
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటి.. పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల వాయిదా పడింది. చివరికి జులై 11న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఇటీవలే ప్రకటించింది.. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ఓ వార్త షికారు చేస్తుంది. సీజీ వర్క్ ఇంకా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. రిలీజ్‌కి ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేకపోవడంతో ఆ వర్క్ టైమ్‌కి ఫినిష్ చేయడం కష్టమని టెక్నికల్ టీమ్ చెప్పిందట. దీంతో ‘ఘాటి’ మరోసారి వాయిదా పడటం ఖాయమని తెలుస్తోంది. రిలీజ్ డేట్ వాయిదా అయినట్లు ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమాకు ఎన్నిసార్లు వాయిదా పడడం పై అనుష్క అభిమానులు పెదవిరుస్తున్నారు. సినిమాని ఎప్పుడూ రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇవ్వాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గిరిజన మహిళ పాత్రలో అనుష్క..
ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తే అనుష్క పవర్ ఫుల్ పాత్రలో నటించిన తెలుస్తుంది. రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క ఓ గిరిజన మహిళగా శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూరి దర్శకుడు. వీరిద్దరి కాంబోలో ‘వేదం’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అందులో అనుష్క వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. 14 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది.
Also Read : అయ్యో శివయ్య… విష్ణుపై దయ చూపవయ్య… 5వ రోజుల్లో మరీ ఇంత తక్కువా ?
ఘాటి బిజినెస్ డీటెయిల్స్..
ఈ సినిమా రిలీజ్ కి ముందే లాభాల బాట పట్టింది. ఈ మూవీ బిజినెస్ విషయానికొస్తే.. దాదాపు 35 కోట్ల బడ్జెట్‌తో తీయగా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే రూ.50 కోట్ల వరకు వచ్చిందట. థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ12కోట్లు, ఓటీటీ, ఆడియో రైట్స్ ద్వారా రూ.38 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. రిలీజ్ కి ముందే ఈ సినిమా నిర్మాతలకు 10 కోట్లకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టింది.. ఈ చిత్రం ద్వారా తెలుగులో మళ్లీ గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని అనుష్క ట్రై చేస్తుంది.