Bipasha Basu Audio Leak :ఈ మధ్యకాలంలో ఆడియో లీక్ ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఆడియో లీకుల వల్ల చాలామంది ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా అటు సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా వీరి మధ్య ఎప్పటినుంచో తెలియని రిలేషన్స్ ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉంటాయి. పైగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇవి మరింత వైరల్ అవుతున్నాయని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ ను అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ లీకైన ఒక ఆడియో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఆడియో లీకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా పదవికే ఆటంకం కలిగేలా ఉందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేప్..
గతంలో కేంద్ర రాజకీయాలలో ముఖ్యంగా ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో చక్రం తిప్పిన ఒక బడా నేతకు బాలీవుడ్ లో శృంగార తారగా పేరు సొంతం చేసుకున్న ఒక నటికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఒక ఆడియో టేప్ గా భావిస్తున్న ఒక ఫైల్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. ముఖ్యంగా ఈ ఆడియో టేప్ లో ఇద్దరి మాటలు విన్న తర్వాత ఎంతటి వారైనా సరే ముక్కున వేలేసుకుంటున్నారు. మరి అలా లీకైన ఆడియో టేప్ లో వారు ఏం మాట్లాడుకున్నారు అనే వివరాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
రాజకీయాలలో సంచలనం సృష్టించిన బడా నేత..
అసలు విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ గుర్తింపుతో పాటు అన్ని పార్టీలను ఏకం చేసే సత్తా ఉన్న ఒక అగ్ర నాయకుడిగా పేరు సొంతం చేసుకున్నాయని.. లక్నో కేంద్రంగా తన రాజకీయ ఉనికిని చాటుకుంటూ ఢిల్లీ రాజకీయాలను కూడా తన సైగలతో శాసించారు. అటు ప్రభుత్వాల ఏర్పాట్లు పారిశ్రామికవేత్తలను లాబీయింగ్ ద్వారా మచ్చిక చేసుకోవడంలో కూడా ఆయన తర్వాతే ఎవరైనా.. ఈయన సినీ రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో అగ్ర సినీతారలకు తమ పార్టీ తరఫున రాజ్యసభ, లోకసభకు పంపిన ఘనత కూడా ఉంది. అలాంటి ఈయనతో శృంగార తారగా పిలువబడుతున్న ఒక నటి ఆయనతో మాట్లాడినట్లు ఆడియో టేప్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
అనుమానాలు రేకెత్తిస్తున్న ఆడియో టేప్..
ఇంక మొదట హాయ్, హౌ ఆర్ యు అని ఆడ గొంతు వినిపిస్తే.. అయామ్ ఫైన్ అంటూ మగ గొంతు సమాధానం ఇచ్చింది. నీతో మాట్లాడి చాలా రోజులు అయింది? ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నలు వేసింది. మీరు చాలా బిజీగా ఉన్నట్టు ఉన్నారు అనుకుంటా? అని ఆమె అంటే.. ఎవరు అంటూ సమాధానం ఇచ్చారు అవతలి వ్యక్తి. ఆ తర్వాత అవార్డ్ ఫంక్షన్లో రెండుసార్లు చూశాను అంటూ చెప్పింది. అలా వారి మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా ఎప్పుడు కలుస్తున్నారు అని ఆమె అడగగా.. కలిసేది ఎక్కడ చెప్పు.. టైం వీలుపడడం లేదు.. బిజీగా ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు. తర్వాత నేను ఇప్పుడు పురాతన శిలాజంలా ఉన్నాను అంటే.. వయసుతో పట్టించుకునేది ఏముంది? అని ఆమె అంటుంది. ఆ తర్వాత అతడు ఇచ్చిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తప్పకుండా టైం తీసుకుంటాను కలుద్దాం అంటూ ఆ వ్యక్తి చెప్పడం దానికి ఆమె సరే అనడం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో టేపు సంచలనం సృష్టిస్తోంది. ఏది ఏమైనా ఈ ఒక్క ఆడియో టేపు పలు అనుమానాలకు దారి తీయడమే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ ఇద్దరూ ఈ ఇద్దరేనా..
ఇకపోతే ఆ ఆడియో టేప్ లో విన్న సంభాషణ వాయిస్ ని బట్టి చూస్తే ప్రముఖ బాలీవుడ్ శృంగార తార బిపాసా బసు, బడా రాజకీయ నేత అమర్ సింగ్ లకు సంబంధించిన ఆడియో అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో ఇప్పుడు పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.
ALSO READ:Agni Pariksha: డైరెక్టర్ క్రిష్ కే చెమటలు పట్టించిన అగ్నిపరీక్ష.. ఇదెక్కడి ఉత్కంఠరా బాబు?
Bipasha Basu's call recording with Amar Singh got leaked.
Nothing stays hidden forever.
Internet exposes everything.pic.twitter.com/zah3DVzTfH— ShoneeKapoor (@ShoneeKapoor) August 25, 2025