Bigg Boss Agni pariksha:బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 5వ తేదీ నుండీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ షోలో ఈసారి ఏకంగా ఐదు మంది హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అందులో భాగంగానే 20,000 అప్లికేషన్లు సామాన్యుల నుంచి రాగా.. వివిధ రౌండ్ల ద్వారా 45 మందిని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ 45 మందికి బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జ్ లుగా వ్యవహరిస్తూ ఉండగా.. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్షకి క్రిష్ జాగర్లమూడి..
తాజాగా ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో కి సంబంధించిన ఐదవ ఎపిసోడ్ ప్రసారం అవ్వగా.. ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి విచ్చేశారు. తాను అనుష్క తో కలసి తెరకెక్కిస్తున్న ఘాటీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అగ్ని పరీక్షా హౌస్ కి గెస్ట్ గా వచ్చిన ఈయన అక్కడ సామాన్యులకు జడ్జెస్ ఇస్తున్న టాస్కులు చూసి ఆయనే ఉత్కంఠతో ఏం జరుగుతుందో తెలియక తికమక పడిపోయారు. ఎపిసోడ్ లో భాగంగా క్రిష్ జాగర్లమూడి తన మూవీ ఘాటీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సీతమ్మవారు అగ్నిపరీక్ష ఎదుర్కొని బయటపడితే.. ఈ ఘాటీ సినిమాలో సీతమ్మ వారే లంకా దహనం చేయడానికి సిద్ధమయ్యారు అంటూ ట్రైలర్ లో చెప్పే డైలాగు సినిమాపై అంచనాలు పెంచేసింది.
అగ్ని పరీక్ష షో టాస్క్ లకి డైరెక్టర్ కే చెమటలు.
ఇకపోతే ఈ ఎపిసోడ్ లో భాగంగా.. డేర్ ఆర్ డై టాస్క్ లో లెవెల్ 2 నిర్వహించారు. అందులో ఇప్పటివరకు డేర్ టాస్క్ చేయని ఆరు మందిని స్టేజ్ పైకి నవదీప్ పిలుస్తూ.. ఎవరైతే గ్లాస్ వాటర్ తో నవదీప్ ముఖం మీద కొడతారో వారు ఆ టాస్క్ విన్ అయినట్టు అని నవదీప్ చెబుతాడు. అంతేకాదు నవదీప్ మాట్లాడుతూ.. ఈ టాస్క్ విన్ అయినా కాకపోయినా తుది నిర్ణయం మా చేతుల్లోనే అని నవదీప్ చెప్పడంతో ఎవరు కూడా ఈ టాస్క్ చేయడానికి ముందుకు రారు. అటు క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ.. నేను టెన్షన్ తో ఊగిపోతున్నాను ఎవరు నవదీప్ ముఖాన నీళ్లు కొడతారా అని.. నేనే కంటెస్టెంట్ అయి ఉంటే మరో మాట ఆలోచించకుండా ధైర్యంగా ముఖం మీద నీళ్లు కొట్టేవాడిని అంటూ కంటెస్టెంట్స్ లో స్పూర్తి నింపే ప్రయత్నం చేశారు. కానీ అటువైపు నుంచి ఎవరూ ముందుకు రాలేదు. ఇక తర్వాత మరో టాస్క్ నిర్వహించారు. ఇలా టాస్కులు మీద టాస్కులు చూస్తూ తనకు ఉత్కంఠ పెరిగిపోతోందని క్రిష్ చెప్పడం హైలెట్గా నిలిచింది. మొత్తానికైతే డైరెక్టర్ క్రిష్ కె చెమటలు పట్టించిన ఈ అగ్ని పరీక్ష ఇక సామాన్యులను ఏ రేంజ్ లో అలరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ALSO READ:Shilpa Shetty: హీరోయిన్ శిల్పాశెట్టి ఇంట విషాదం.. పోస్ట్ వైరల్!