BigTV English

Nara Rohit: రివ్యూవర్లను వేడుకుంటున్న నారా రోహిత్.. కాస్త దయ చూపండయ్యా!

Nara Rohit: రివ్యూవర్లను వేడుకుంటున్న నారా రోహిత్.. కాస్త దయ చూపండయ్యా!

Nara Rohit: సాధారణంగా ఏ సినిమా అయినా సరే విడుదలకు సిద్ధమవుతోంది అంటే ఆడియన్స్ థియేటర్ కి వస్తారో .. రారో అనే భయంతో పాటు రివ్యూ రాసేవారికి కూడా చిత్ర బృందం భయపడుతూ ఉంటుంది. కొంతమంది కావాలనే సినిమాలో కంటెంట్ ఉన్నా.. సినిమా బాగాలేదని రివ్యూలు రాస్తూ ఉంటారు. ఈ రివ్యూలు చూసి దాదాపు ఆడియన్స్ సినిమా థియేటర్ కి వెళ్లక పోగా.. అటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం కలుగుతుంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు కూడా రివ్యూవర్ లపై పలు రకాల కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి చాలామంది దర్శక నిర్మాతలు, హీరోలు ఇలా రివ్యూ రాసే వారిపై మండిపడితే.. నారా రోహిత్ మాత్రం వేడుకుంటున్నారు. మరి ఆ రివ్యూవర్స్ కాస్తైనా రోహిత్ పై దయ చూపిస్తారా ? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.


వినాయక చవితి సందర్భంగా రాబోతున్న సుందరకాండ..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రతినిధి 2, భైరవ సినిమాల తర్వాత నారా రోహిత్ (Nara Rohit) తాజాగా నటిస్తున్న చిత్రం ‘సుందరకాండ’.. పెళ్లి కోసం యువకుడు పడే ఆరాటాన్ని తెరపై చాలా చక్కగా ప్రదర్శించబోతున్నట్లు ఇటీవలే ట్రైలర్ ద్వారా చూపించేశారు. ఇకపోతే ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ రివ్యూవర్లను వేడుకున్నారు.


రివ్యూ రాసేవారిని వేడుకున్న నారా రోహిత్..

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. “ఒక డైరెక్టర్ హీరోని నమ్మి ఎన్ని రోజులు అతడితో ఉంటాడో నాకు తెలియదు. కానీ ఈ సినిమా కోసం వెంకీ నాతో ఆరేళ్లు కలిసి ప్రయాణం చేశారు. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం నాలో ఉంది. నిజానికి నాపై చాలామంది కోపంతో పోస్టులు పెట్టేస్తూ ఉంటారు. వాళ్లకి నేను నచ్చకపోవడానికి కూడా కారణాలు చాలా ఉంటాయి.. కానీ సినిమా అంటే నేను ఒక్కడినే కాదు కదా.. దాని వెనుక ఎంతోమంది ఉంటారు. వాళ్ళ కష్టం దాగి ఉంటుంది. నామీద కోపం ఉంటే సినిమా నచ్చలేదని రాయండి. కాకపోతే నిజంగా థియేటర్ కి వెళ్లి చూసి, నచ్చితేనే సపోర్ట్ చేయండి. నచ్చకపోతే మీకు నచ్చింది రాయండి. ఏది రాసినా మీరు సినిమా చూశాకే రాయండి. అదొక్కటే నేను వేడుకుంటున్నాను” అంటూ రోహిత్ అన్నారు. మొత్తానికైతే నారా రోహిత్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు నెటిజన్లు కూడా రివ్యూ రాసేవారికి కాస్త ఆయన పైన దయ చూపండి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సుందరకాండ సినిమా విశేషాలు..

సుందరకాండ సినిమా విషయానికి వస్తే.. వెంకటేష్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi) దర్శకత్వంలో ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా రాబోతున్న చిత్రం సుందరకాండ. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా శ్రీదేవి విజయ్ కుమార్ ఈ సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనున్నారు. ఇక ఈ చిత్రాన్ని సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతంరెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సుందరాకాండ సినిమా ఈ నటీనటులకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

also read: Bipasha Basu:శృ*గా*ర తారతో సీనియర్ పొలిటిషన్ ఆడియో లీక్.. వయసుతో సంబంధం ఏంటి అంటూ?

Related News

Sai Durga Tej: టి-హబ్‌లో ఫాస్ట్ & క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్‌పో ప్రారంభించిన మోగా హీరో

Jeevitha Rajasekhar : సినిమా అయ్యాక డైరెక్టర్ ను పక్కకు తోసేశారు, డైరెక్టర్ ఆవేదన

Dark Chocolate Teaser: డార్క్ చాక్లెట్ టీజర్ రిలీజ్.. టీజర్ మొత్తం బూతులే !

K – Ramp Trailer : ట్రైలర్ కూడా ర్యాంప్, ఓపెనింగ్స్ ఖాయం 

Pawan Kalyan: మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు.. ఎమోషలైన పవన్ కళ్యాణ్!

Trivikram : పని అయిపోయింది పడిపోయాడు అనుకున్నారు, కానీ కెరటంలా పైకి లేచాడు

Vijay Devarakonda: విజయ్‌ ‘రౌడీ జనార్థన్‌’ కోసం రంగంలోకి మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌

Yellamma: నితిన్‌ చేజారిన ఎల్లమ్మ.. రంగంలోకి బెల్లంకొండ హీరో?

Big Stories

×