BigTV English

NTR War 2 : వార్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్… బాలీవుడ్‌లో ఎన్టీఆర్ మూవీ రద్దు ?

NTR War 2 : వార్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్… బాలీవుడ్‌లో ఎన్టీఆర్ మూవీ రద్దు ?

War 2 Movie: టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్గా బాలీవుడ్ లోకి వార్ 2 మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇటీవల థియేటర్లోకి వచ్చేసింది.. మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ ని అందుకోవడంతో కలెక్షన్లు పెద్దగా రాలేదని తెలుస్తుంది. ఈ మూవీకి పోటీగా రజనీకాంత్ ‘కూలీ’ మూవీ కూడా రావడంతో దీనికి కలెక్షన్లు ఎక్కువగా రాలేదని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.. వార్ 2 డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ YRF సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త బాలీవుడ్ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.. అదేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..


వార్ 2 బాక్సాఫీస్ కలెక్షన్స్..

ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వాని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం వార్ 2.. ఆగస్టు 14 న థియేటర్లలోకి భారీ అంచనాలతో వచ్చేసింది. రిలీజ్ కి ముందు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ అయిన తర్వాత తేలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. 12వ రోజున, ఈ చిత్రం కేవలం రూ. 1.01 కోట్లను రాబట్టింది. దాంతో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 300 కోట్ల లోపే వసూల్ చేసిందని టాక్..


వార్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్.. ఎన్టీఆర్ కు షాక్..

బాలీవుడ్ నిర్మాణ సంస్థ YRF ఎన్టీఆర్ తో ఏజెంట్ విక్రమ్ మూవీని నిర్మించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వార్ 2 విడుదలకు ముందే స్పై లకు బ్రేక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ క్రమంలోనే షారుఖ్, సల్మాన్ హీరోలుగా ప్లాన్ చేసిన టైగర్ Vs పఠాన్ ఆలోచన మానుకున్నారు. ఇదే జరిగితే స్పై ల్లో వార్ 2 చివరిది అవుతుంది. అలియా భట్‌తో ఆల్ఫా అనే లేడీ ఓరియెంటెడ్ స్పై నిర్మిస్తుంది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతుందట.. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read : బిగ్ బాస్ లోకి మరో కన్నడ నటి.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

ఆదిత్య చోప్రా బిగ్ మూవ్..

ఏజెంట్ విక్రమ్ సినిమాతో ముందుకు వెళ్లకూడదని ఆదిత్య చోప్రా నిర్ణయించుకున్నాడని, బదులుగా స్పై యూనివర్స్ డైరెక్షన్‌ని మళ్లీ రూపొందించడంపై దృష్టి పెట్టాడని ఇండస్ట్రీలో ఓ వార్త వినిపిస్తుంది. నివేదిక ప్రకారం.. చోప్రా ఈ నిర్ణయాన్ని నేరుగా ఎన్టీఆర్‌కి తెలియజేశాడట.. ఎన్టీఆర్ కూడా సైలెంట్ గా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత రాజమౌళితో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది..

Related News

Mass Jathara: అనుకున్నదే అయ్యింది.. మాస్ మహారాజా కూడా వెనక్కి తగ్గాడు

Sundarakanda Movie: నారా వారి మూవీలో మంచు హీరో… ఎక్కడో బంధం కలుస్తుంది

Mirai New Release Date: మళ్లీ వాయిదా పడ్డ మిరాయ్‌, ట్రైలర్‌ అప్‌డేట్‌తో షాకిచ్చిన మూవీ టీం!

The Girlfriend: రష్మిక – దీక్షిత్ మధ్య ‘ఏం జరుగుతోంది.’. ?

Madharasi OTT : భారీ ధరకు ‘మదరాసి’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ఎన్ని కోట్లంటే..?

Nara Rohit: రివ్యూవర్లను వేడుకుంటున్న నారా రోహిత్.. కాస్త దయ చూపండయ్యా!

Big Stories

×