E-Paper
Advertisement

Bollywood: భారీ ఊరట.. 20 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లోకి!

Bollywood: భారీ ఊరట.. 20 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లోకి!
Advertisement

Bollywood: గత కొన్ని రోజులుగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన కలెక్షన్లు లేక బోసిపోయిన బాలీవుడ్ కి ఇప్పుడు భారీ ఊరట కలిగిందనే చెప్పాలి.. రీసెంట్ గా వచ్చిన ఒక సినిమా ఏకంగా 20 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. అంతేకాదు బాలీవుడ్ కి సరికొత్త కళను తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమా ఫలితం కారణంగా అటు ప్రపంచ దర్శక దిగ్గజం జేమ్స్ కామరూన్ దర్శకత్వం వహించిన అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా ఫలితం పై కూడా ప్రభావం చూపింది అంటే ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ సినిమాను టీ 20 క్రికెట్ ప్లేయర్లు కూడా ప్రత్యేకంగా ఒక మల్టీప్లెక్స్ బుక్ చేసుకుని మరీ చూడడంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. మరి ఆ సినిమా ఏంటి ? ఆ సినిమా విశేషాలు ఏంటో? ఇప్పుడు చూద్దాం.

1000 కోట్ల క్లబ్ లో ధురంధర్..

ఆ చిత్రం ఏదో కాదు ధురంధర్. రణ్ వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన ఈ సినిమా ఇప్పుడు హిందీ బాక్స్ ఆఫీస్ ను శాసిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తూ.. ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా మరో రికార్డును దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన 21 రోజుల్లోనే ఏకంగా 1000 కోట్ల మార్కు దాటేసింది. క్రిస్మస్ సందర్భంగా 26 కోట్లతో కలెక్షన్ల పరంగా అదరగొట్టేసింది. ఈ సినిమా మొత్తం దేశవ్యాప్తంగా రూ.668.80 కోట్లు రాబట్టిగా.. ప్రపంచ వ్యాప్తంగా 1006.7 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Advertisement

also read:Vanara Movie: ఆఖరి నిమిషంలో టైటిల్ చేంజ్.. అసలు కారణం ఏంటంటే?

రెండవ భాగం విడుదల ఎప్పుడంటే?

ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఏ రేటింగ్ సినిమాగా అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ఇకపోతే ఇంతకుముందు ఈ రికార్డు రణబీర్ కపూర్ యానిమల్ పేరిట ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రికార్డును రణవీర్ సింగ్ బ్రేక్ చేశారు.  ఈ సినిమాకి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. పాకిస్తాన్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో సంజయ్ దత్, రాకేష్ బేడి, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్ , బి 62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రెండవ భాగం వచ్చే ఏడాది మార్చి 19న రెండవ భాగం కూడా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరిన సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

Advertisement

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×