E-Paper
Advertisement

Fatty Liver: కాలేయంలో కొవ్వును కరిగించాలా? ఈ 6 సూపర్ ఫుడ్స్ మీ డైట్‌లో ఉండాల్సిందే

Fatty Liver: కాలేయంలో కొవ్వును కరిగించాలా? ఈ 6 సూపర్ ఫుడ్స్ మీ డైట్‌లో ఉండాల్సిందే
Advertisement

Fatty Liver: ఫ్యాటీ లివర్ అనేది ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీనిని నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది. అయితే.. సరైన ఆహారపు అలవాట్లతో ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

మెగ్నీషియం శరీరంలోని 300 కంటే ఎక్కువ ఎంజైమ్ ప్రక్రియలలో పాల్గొంటుంది. ఇది ఇన్‌సులిన్ నిరోధకతను తగ్గించడం ద్వారా కాలేయంలో కొవ్వు చేరకుండా నిరోధిస్తుంది. నిపుణులు సూచించిన టాప్ 6 మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆకుకూరలు:

Advertisement

పాలకూర వంటి ముదురు రంగు ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిలోని క్లోరోఫిల్ కాలేయంలోని విషతుల్యాలను తొలగించడంలో సహాయ పడుతుంది. పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఇవి కాలేయ కణాల వాపును తగ్గిస్తాయి.

2. గుమ్మడి గింజలు:

మెగ్నీషియానికి పవర్ హౌస్‌గా గుమ్మడి గింజలను చెప్పవచ్చు. కేవలం ఒక పావు కప్పు గుమ్మడి గింజల ద్వారా రోజువారీ అవసరమైన మెగ్నీషియంలో సగానికి పైగా పొందవచ్చు. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, కాలేయంపై ఒత్తిడిని తగ్గించి జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి.

3. బాదం ,జీడిపప్పు:

గింజ ధాన్యాలలో మెగ్నీషియంతో పాటు విటమిన్ E అధికంగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం విటమిన్ E ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులు తీసుకోవడం వల్ల కాలేయానికి అవసరమైన పోషణ అందుతుంది.

4. అవకాడో:

అవకాడోలో మెగ్నీషియంతో పాటు పొటాషియం , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కాలేయంలో చెడు కొవ్వును కరిగించి.. మంచి కొవ్వును పెంచడంలో తోడ్పడతాయి. ఇందులో ఉండే గ్లుటాథయోన్ అనే పదార్ధం కాలేయాన్ని శుద్ధి చేయడంలో సహాయ పడుతుంది.

Also Read: పీడకలలు ఎందుకు వస్తాయి ? భయంకరమైన కలల వెనక ఉన్న శాస్త్రీయ కారణాలు

5. చిక్కుడు జాతి గింజలు:

శనగలు, పెసలు, రాజ్మా వంటి చిక్కుడు గింజలలో మెగ్నీషియం, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. దీని వల్ల కాలేయం అదనపు చక్కెరను కొవ్వుగా మార్చే ప్రక్రియ మందగిస్తుంది.

6. డార్క్ చాక్లెట్:

అవును, కనీసం 70% కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా.. కాలేయానికి రక్త ప్రసరణను పెంచుతుంది. అయితే.. దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడానికి కేవలం మెగ్నీషియం ఆహారాలు మాత్రమే సరిపోవు. వీటితో పాటు పంచదార, మైదా, వేపుళ్లకు దూరంగా ఉండాలి. రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం తప్పనిసరి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×