E-Paper
Advertisement

Vanara Movie: ఆఖరి నిమిషంలో టైటిల్ చేంజ్.. అసలు కారణం ఏంటంటే?

Vanara Movie: ఆఖరి నిమిషంలో టైటిల్ చేంజ్.. అసలు కారణం ఏంటంటే?
Advertisement

Vanara Movie:ఏ భాషలో అయినా సరే ఒక సినిమా విడుదల అవ్వాలి అంటే దానికి సెన్సార్ తప్పనిసరి..సెన్సార్ సర్టిఫికెట్ ఉంటేనే ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.అయితే ఒక్కొక్కసారి సెన్సార్ సభ్యులు చెప్పే విషయాలను కూడా తప్పకుండా పాటించాల్సిందే. ముఖ్యంగా సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు, అసభ్య పదజాలాలతో పాటు సమాజానికి ఇబ్బంది కలిగించే అంశాలు ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని చేంజ్ చేయాల్సిందే. అలా ఇప్పటికే విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో సెన్సార్ చెప్పిన చేర్పులు మార్పులు చేసుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చిత్ర బృందం. అయితే అలాంటి ఒక సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సడన్గా టైటిల్ చేంజ్ చేయమని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక టైటిల్ ని కూడా మార్చుకోవడం జరిగింది.

ఆఖరి క్షణంలో టైటిల్ మార్చుకున్న చిత్ర బృందం..

ఆ సినిమా ఏదో కాదు వానర. అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం వానర. ఇందులో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా, ఆర్టిస్టుగా మంచి పేరు సొంతం చేసుకున్న నందు విలన్ గా ఈ సినిమాలో కనిపించనున్నారు ఇకపోతే ఈ సినిమా జనవరి 1వ తేదీన విడుదల కాబోతోంది. విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ వద్దకు వెళ్ళగా అక్కడ సెన్సార్ నిర్వాహకులు టైటిల్ ని మార్చమని సలహా ఇచ్చారట.. దీనికి కారణం వానర అనే టైటిల్ కారణంగా మరేదైనా సమస్య వస్తుందేమో అని ముందే ఆలోచించిన సెన్సార్ సభ్యులు వానర అనే టైటిల్ చేంజ్ చేయమని సూచించారట. దీంతో ఈ సినిమా టైటిల్ ను ఇప్పుడు వనవీరగా మార్చారు. అలా వానర కాస్త వనవీరగా జనవరి 1న విడుదల కాబోతోంది.

వనవీర సినిమా విశేషాలు..

Advertisement

ఈ సినిమాను శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ పతాకంపై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు రాశారు. మైథాలజికల్ రూరల్ డ్రామా కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై కూడా అంచనాలు పెంచింది. దీనికి తోడు ఆఖరి నిమిషంలో టైటిల్ కూడా చేంజ్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వనవీరగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట “అదరహో..” శ్రోతలను విపరీతంగా అలరిస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ALSO READ:Rukmini Vasanth: లక్కీ ఛాన్స్ కొట్టేసిన రుక్మిణి.. ఆమె కలను నెరవేరుస్తున్న డైరెక్టర్స్!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×