RAPO 23: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవల హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే గత కొంతకాలంగా రామ్ నటిస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈయన దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం రామ్ పోతినేని(Ram Pothineni) స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ RAPO 23. ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వూల్ఫ్ అనే టాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రామ్ పోతినేని జోడిగా నటి సంయుక్త మీనన్(Samyuktha Menon) నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా సినిమాకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్(Riteish deshmukh) నటించబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
దసరా సందర్భంగా చిత్ర యూనిట్ రితేష్ దేశ్‌ముఖ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ ఒక స్పెషల్ వీడియో విడుదల చేయడమే కాకుండా ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ ప్రారంభమైందనే అప్డేట్ కూడా తెలియజేశారు. ఇలా ఈ సినిమాలో రితేష్ నటించబోతున్నారనే విషయం తెలియగానే ఈ సినిమాకు భారీ స్థాయిలో హైప్ పెరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైనటువంటి సినిమాలలో, విభిన్న పాత్రలలో నటించిన రితేష్ ఇప్పుడు రామ్ సినిమాలో ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు అంటూ అభిమానులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Welcoming the ever-versatile @Riteishd on board for a very EXCITING ROLE ❤️🔥 #RAPO23 New Schedule Begins 💥
— https://t.co/nRXfSAvChh#HappyDussehra
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics Production.Energetic Star @ramsayz 🐺🖤… pic.twitter.com/q57BYwNwrs
— RAPO Cinematics (@RAPO_Cinematics) October 19, 2026
ఇక రామ్ పోతినేని, జెనీలియా (Genelia) ఇద్దరు పలు సినిమాలలో నటించి సందడి చేశారు. ఇలా వీరిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహబంధం కారణంగానే రామ్ పోతినేని సినిమాలో రితేష్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతం అవుతున్న రామ్ పోతినేని ఈసారి స్వీయ దర్శకత్వంలో నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ద్వారా ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.
Also Read: కావ్యతో అనిరుద్ పెళ్ళి…కట్నం ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?