E-Paper
Advertisement

2 గంటల ఫ్లైట్ జర్నీ వద్దని.. 32 గంటలు రైల్లో ప్రయాణించిన కుటుంబం, ఎందుకో తెలుసా?

2 గంటల ఫ్లైట్ జర్నీ వద్దని.. 32 గంటలు రైల్లో ప్రయాణించిన కుటుంబం, ఎందుకో తెలుసా?
Advertisement

Memorable Train Journey: ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి త్వరగా వెళ్లాలంటే.. సాధారణంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. కానీ, కొందరికి ప్రయాణంలో కనిపించే ప్రకృతి అందాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, క్రేజీ ఎక్స్ పీరియెన్స్ అసలైన ఆనందాన్ని ఇస్తాయి. ఇలాంటి ఆలోచనతోనే ఓ ఫ్యామిలీ రెండు గంటల్లో చేరుకునే ప్రయాణం కోసం ఏకంగా 32 గంటలు రైలులో గడిపింది. మంగోలియా నుంచి చైనా వరకు సాగిన ఈ ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విమానాన్ని కాదని రైల్లో ప్రయాణం..   

జెరీ విల్మాట్, ఆమె భర్త పీటర్ తమ పిల్లలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా కొత్త ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఇటీవల మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్ నుంచి చైనాలోని బీజింగ్‌కు వెళ్లేందుకు వాళ్లు ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు. విమానంలో వెళ్తే దాదాపు రెండు గంటల్లో చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈ కుటుంబం రైల్లో ప్రయాణించాలనుకుంది. దాదాపు 32 గంటల పాటు సాగిన ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త అనుభవాలను సొంతం చేసుకుంది.

అర్ధరాత్రి సరిహద్దు దాటడం.. రైలు చక్రాల మార్పు!

Advertisement

ఈ ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైన విషయం మంగోలియా, చైనా సరిహద్దు దగ్గర ఎదురైన ఎక్స్ పీరియెన్స్. పాస్‌ పోర్ట్ చెకింగ్స్ కోసం రైలు సుమారు నాలుగు గంటల పాటు ఆగినట్లు జెరీ వివరించారు. అంతేకాదు, మంగోలియా, చైనా దేశాల్లో రైల్వే పట్టాల మధ్య వెడల్పు ఒకేలా ఉండదు. అందువల్ల సరిహద్దు వద్ద రైలు చక్రాలకు సంబంధించిన ప్రత్యేక మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ కూడా ప్రయాణంలో ఒక  ఎక్స్ పీరియెన్స్ అందించింది. ఆ తర్వాత ఎరెన్‌హాట్, జినింగ్, జాంగ్‌జియాకౌ లాంటి ప్రాంతాల మీదుగా రైలు ప్రయాణించి చివరకు బీజింగ్‌కు చేరుకుంది. మంగోలియన్ మైదానాలు, మారుతూ కనిపించే ప్రకృతి దృశ్యాలు ఆ ఫ్యామిలీకి మధుర జ్ఞాపకాలను మిగిల్చాయి.

పిల్లలకు జీవితాంతం గుర్తుండిపోయే ఎక్స్ పీరియెన్స్

ఈ ప్రయాణానికి సంబంధించిన వివరాలను జెరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. విమానంలో వెళ్తే సమయం ఆదా అయ్యేదని, కానీ, రైలులో ప్రయాణించడం వల్ల కొత్త ప్రదేశాలను చూడటం, వివిధ దేశాల ప్రజలను కలవడం, అంతర్జాతీయ సరిహద్దును రైలులో దాటిన అనుభవాన్ని పిల్లలకు వివరించడం సాధ్యమైందన్నారు. ఇప్పటికే ఆగ్నేయాసియాలో పలు స్లీపర్ రైళ్లలో ప్రయాణించిన ఈ కుటుంబానికి, 32 గంటల ప్రయాణమే ఇప్పటి వరకు అత్యంత సుదీర్ఘమైనదిగా గుర్తింపు పొందింది.

సోషల్ మీడియాలో ప్రశంసలు

Advertisement

ఈ ప్రయాణం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆ కుటుంబాన్ని అభినందిస్తున్నారు. పిల్లలకు ఇలాంటి ప్రయాణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందిస్తాయని పలువురు కామెంట్స్ చేశారు. మరికొందరు రైలు ప్రయాణాల్లో కనిపించే అందాలు, అనుభవాలు విమాన ప్రయాణంలో దొరకవన్నారు. వేగంగా గమ్యాన్ని చేరుకోవడమే ప్రయాణం కాదు.. దారిలో ఎదురయ్యే అనుభవాలే జీవితంలో చెరగని జ్ఞాపకాలుగా మిగులుతాయని.. జెరీ కుటుంబం నిరూపించింది.

Read Also: 20 ఏళ్ల కష్టం.. రైల్వే స్టేషన్‌ను అందమైన పూలవనంగా మార్చిన వృద్ధ దంపతులు!

Tags

Related News

యూరప్‌లో టాప్ టూరిజం డెస్టినేషన్‌గా పోర్చుగల్.. ఏకంగా రెండు అవార్డులు కొట్టేసిందిగా..

20 ఏళ్ల కష్టం.. రైల్వే స్టేషన్‌ను అందమైన పూలవనంగా మార్చిన వృద్ధ దంపతులు!

రోడ్డు అనుకుని బిల్‌బోర్డు వైపు దూసుకెళ్లిన ట్రక్కు.. వామ్మో.. ఇదేం వింత ప్రమాదం?

రైల్లోనే ఫైవ్‌స్టార్ హోటల్ ఎక్స్ పీరియెన్స్.. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ బాత్రూమ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

బాబోయ్.. బ్రా ధర రూ. 474 కోట్లా? ఇంతకీ అంత ఖరీదు ఎందుకు బ్రో?

దసరా, దీపావళి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫారిన్ లో టాప్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

రైళ్లలో పెద్ద సౌండ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా? అయితే, ఇక షాక్ తప్పదు!

Big Stories

Advertisement
×