Anirudh -Kavya Maran Wedding: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)కావ్య మారన్ (Kavya Maran) వివాహం జరగబోతోంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఈ జంట ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు కానీ ఈ వార్తలకు మాత్రం పులిస్టాప్ పడలేదు. ఇలా అనిరుద్ కావ్య పెళ్లి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవి ఇది పెళ్లి గురించి అధికారిక ప్రకటన వెలువడింది.
కావ్య అనిరుద్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని, వీరి వివాహాన్ని ప్రముఖ నిర్మాత సన్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, కళానిధి మారన్ (Kalanithi Maran) తన కుమార్తె కావ్య మారన్ వివాహం గురించి తెలియచేశారు. ఇప్పటికే కళానిధి మారన్ తన భార్యతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను తమ కుమార్తె వివాహ రిసెప్షన్ కు ఆహ్వానం అందజేస్తున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం నవంబర్ 10 లేదా 11న గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇలా వివాహం కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో జరిగినప్పటికీ వివాహ రిసెప్షన్ మాత్రం ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
అనిరుద్ కావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే వివాహ రిసెప్షన్ లో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందజేస్తున్నారు. ఇక వీరి పెళ్లి గురించి అధికారక ప్రకటన రావడంతో పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా కళానిధి మారన్ నుంచి అనిరుద్ ఎంత మొత్తంలో కట్నం(Dowry) తీసుకుంటున్నారనే విషయంపై వార్తలు బయటకు వచ్చాయి. అనిరుద్ కావ్యతో ఏడడుగులు నడవడం కోసం ఒక రూపాయి కూడా కట్నం తీసుకోలేదని తెలుస్తోంది కానీ కావ్య మారన్ ఒక్కతే కుమార్తె కావడంతో తన తండ్రికి ఉన్న వేలకోట్ల ఆస్తికి ఇకపై అనిరుద్ కూడా వారసుడేనని, ఇలా కావ్యతో అనిరుద్ వివాహం కావడంతో వేలకోట్ల రూపాయల ఆస్తికి ఈయనే వారసుడని చెప్పాలి.
కావ్య సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఐపిఎల్ టీం తో పాటు ఈమె మరికొన్ని వ్యాపారాలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక అనిరుద్ విషయానికి వస్తే ఈయన చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో తమిళ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న అనిరుధ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన డైరెక్షన్ లో వచ్చిన ప్యారడైజ్, జైలర్ 2 సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..