E-Paper
Advertisement

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?
Advertisement

Dragon Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఒకటి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి వచ్చే ఏడాది జూన్ 11వ తేదీ ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు కూడా అధికారకంగా వెల్లడించారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ కు జరిగిన ప్రమాదం కారణంగా సర్జరీ అవ్వడంతో షూటింగుకు బ్రేక్ ఇచ్చారు.

డ్రాగన్ పై మేకర్స్ అప్డేట్..

ఇలా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. అనుకున్న విధంగానే ఈ సినిమా జూన్ 11వ తేదీ విడుదల అవుతుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ అభిమానులు సినిమా విషయంలో ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మైత్రి మూవీ నిర్మాతలు ఈ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. అనుకున్న విధంగానే వచ్చే ఏడాది జూన్ నెలలో డ్రాగన్ విడుదల అవుతుందని విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఇక ఎన్టీఆర్ మరొక రెండు వారాలలో ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని, ఇప్పటికే పూర్తి అయిన షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని తెలిపారు.

డ్రాగన్ లో ఆలియా భట్ , షాహిద్ కపూర్..

Advertisement

ఇలా ఎన్టీఆర్ మరొక రెండు వారాలలో షూటింగ్లో పాల్గొనబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు సంతోషపడ్డారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ భాగం కాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు దాదాపు నిజమేనని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా భాగమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం డ్రాగన్ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు షాహిద్ కపూర్ కీలక పాత్రలలో కనిపించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి చిత్ర బృందం అధికారక ప్రకటన వెల్లడించబోతున్నట్టు తెలుస్తుంది.

ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్..

ఇక డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా నటి రుక్మిణి వసంత్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఈయన చివరిగా దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ చిత్రం వార్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇక ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్ని కూడా డ్రాగన్ సినిమా పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కూడా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది.

Advertisement

Also Read: క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×