E-Paper
Advertisement

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!
Advertisement

Jio Rs.200 OTT Pass: ఈ రోజుల్లో రీఛార్జ్ ప్లాన్లు ఎంత ప్రియమయ్యాయో మనందరికీ తెలిసిందే. ఒక పక్క డేటా కోసం, మరోపక్క వినోదం కోసం విడివిడిగా డబ్బులు ఖర్చు పెట్టాలంటే జేబుకు పెద్ద చిల్లే పడుతోంది. ఇలాంటి సమయంలో రిలయన్స్ Jio ఒక అదిరిపోయే ప్యాక్ తీసుకువచ్చింది. కేవలం రూ.200కే డేటాతో పాటు మనకు కావాల్సిన ఓటీటీలన్నీ ఒకేచోట లభిస్తుంటే అంతకంటే కావలసిందేముంది?

రూ.200 ప్లాన్ ప్రత్యేకతలివే:

జియో రూ.200 ఓటీటీ పాస్ వ్యాలిడిటీ 28 రోజులు. దీనిలో మనకు మొత్తం 30GB హైస్పీడ్ 4G లేదా 5G డేటా లభిస్తుంది. ఒకవేళ ఈ డేటా పరిమితి పూర్తయినా కూడా ఇంటర్నెట్ ఆగిపోదు. కొంచెం స్పీడుతో పనిచేస్తూనే ఉంటుంది. మీరు ఇప్పటికే రోజువారీ డేటా ప్లాన్‌లో ఉంటే.. అనుకూలమైన మొబైల్‌లో అపరిమిత 5G డేటాను కూడా ఉచితంగా వాడుకోవచ్చు. రోజుకు కేవలం రూ.7 ఖర్చుతో ఇది లభించడం చాలా పెద్ద ఊరట.

Advertisement

Also Read: పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

15 రకాల OTT ప్లాట్‌ఫామ్స్:

ఈ ప్లాన్ అసలు ఆకర్షణ ఇందులో లభించే వినోదమే. యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌తో పాటు సరికొత్తగా Kuku టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఇందులో చేర్చారు. ఎలాంటి యాడ్స్ లేకుండా యూట్యూబ్ వీడియోలు చూడటంతో పాటు మిగతా ఓటీటీ యాప్‌లను My Jio ద్వారా సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకే రీఛార్జ్‌తో ఇన్ని రకాల సేవలు పొందడం ఎంతో ప్రయోజనకరం.

1000కి పైగా లైవ్ ఛానెళ్లు:

Advertisement

సినిమాలు, వెబ్ సిరీస్‌లే కాకుండా లైవ్ స్ట్రీమింగ్ చూసేవారి కోసం జియో టీవీ ద్వారా 1000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా ఇస్తున్నారు. ఇందులో 150 కంటే ఎక్కువ పెయిడ్ ఛానెళ్లు ఉన్నాయి. జియోస్టార్, సోనీ, సన్ టీవీ, వార్నర్ బ్రదర్స్ వంటి ప్రముఖ నెట్‌వర్క్ ఛానెళ్లు అందుబాటులో ఉంటాయి. వార్తలు, సినిమాలు, పిల్లల కార్యక్రమాలకు ఇదో చక్కటి వేదిక.

మూవీ లవర్స్‌కు అదనపు డిస్కౌంట్లు:

ఇంటి పట్టున వినోదమే కాకుండా.. బయటకు వెళ్లి సినిమాలు చూసే వారిని కూడా జియో ఆకట్టుకుంది. సినీపోలిస్ థియేటర్లలో రూ.550 విలువైన రెండు టిక్కెట్లు కొంటే రూ.150 తగ్గింపు లభిస్తుంది. అలాగే అక్కడి స్నాక్స్‌పై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ కూపన్లను My Jio App ద్వారా పొంది శని, ఆదివారాల్లో హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!

Tags

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×