Crime Thriller Series OTT : మన పక్కింట్లోనే ఓ షాకింగ్ మర్డర్ జరిగితే ? నిన్నటి వరకు మనకు పరిచయమైన వ్యక్తే ఒక్కసారిగా క్రిమినల్ గా మారితే ? సాధారణంగా కనిపించే ఓ కుటుంబ గొడవ వెనుక ఊహించని హత్య దాగి ఉంటే ? ఇలాంటి నిజ జీవిత నేరాల నుంచి స్ఫూర్తి పొందిన కథలను క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ తో చూపించే పాపులర్ క్రైమ్ ఆంథాలజీ సిరీస్ ‘Crime Patrol’. దేశవ్యాప్తంగా జరిగే నేరాల వెనుక కారణాలను, పోలీసుల దర్యాప్తును, నేరస్తులు చిక్కే విధానాన్ని కథల రూపంలో చూపించడం ఈ సిరీస్ ప్రత్యేకత. ఇప్పటికే పలు Crime Patrol సిరీస్ లు, వందలాది ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఒక్కో కేసు వెనుక దాగిన అసలు మిస్టరీ ఏంటి ? నేరం ఎలా జరిగింది ? పోలీసులు ఎలాంటి ఆధారాలతో నిందితుల వరకు చేరుకున్నారు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
‘క్రైమ్ పెట్రోల్ కు ఒకే కథ ఉండదు. ప్రతి ఎపిసోడ్ లో కొత్త కేసు, కొత్త పాత్రలు, కొత్త నేరం, కొత్త ఇన్వెస్టిగేషన్ కనిపిస్తాయి. హత్యలు, కిడ్నాప్‌లు, మిస్సింగ్ కేసులు, మోసాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు ఇలా సమాజంలో ఎదురయ్యే ఎన్నో రకాల నేరాలను కథలుగా మలుస్తారు. మిస్టీరియస్ కాల్స్, కనిపించకుండా పోయిన వ్యక్తులు, బాంబు పేలుళ్లు, హత్యలు వంటి విభిన్న కేసులు ఉన్నాయి.
ఒక చిన్న అనుమానం పోలీసులను పెద్ద నేరం వైపు తీసుకెళ్లడం, మొదట నిర్దోషిలా కనిపించిన వ్యక్తిపై ఆధారాలు దొరకడం, కుటుంబ సభ్యుల మధ్య దాగి ఉన్న రహస్యాలు బయట పడటం వంటి మలుపులతో ఎపిసోడ్ లు ముందుకు సాగుతాయి. అసలు నేరస్తుడు ఎవరు ? హత్యకు కారణం ఏంటి ? కనిపించకుండా పోయిన వ్యక్తి ఎక్కడున్నాడు ? పోలీసులకు దొరికిన చిన్న క్లూ మొత్తం కేసును ఎలా మార్చింది ? అనే ప్రశ్నలు చివరి వరకు ఉత్కంఠ పెంచుతాయి.
Also Read : ఒలింపిక్స్ వివాదం వెనుక అసలు కథ… 6.2 రేటింగ్ ఉన్న మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ
SonyLIVలో ‘Crime Patrol Satark’, ‘Crime Patrol City Crimes’, ‘Crime Patrol 2.0’, ‘Crime Patrol 48 Hours’, ‘Crime Patrol Dial 100’ వంటి పలు వెర్షన్లు ఉన్నాయి. ఈ హిందీ క్రైమ్ సిరీస్ మొత్తం 10 సీజన్లుగా వచ్చింది. 943 ఎపిసోడ్లతో ఉంది. ఇందులో నిజ జీవిత ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కేసులు కథలుగా చూపించారు. ఇక తాజాగా మరో సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. హిందీ ఒరిజినల్ లో కేసుల ప్రెజెంటేషన్, పోలీసుల దర్యాప్తు, మలుపులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఒక్కో ఎపిసోడ్ పూర్తయ్యే వరకు అసలు నిందితుడు ఎవరో ఊహించడం కష్టమే. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తాజా సిరీస్ ‘Crime Patrol (2026)’ కూడా క్రైమ్ మిస్టరీలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, షాకింగ్ ట్విస్టులు వంటి అంశాలతో ఉంటుంది.