E-Paper
Advertisement

Actor Prabhu : నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు..

Actor Prabhu : నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు..
Advertisement

Actor Prabhu : ఈ మధ్య తమిళ్ ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.. కొందరు వ్యక్తులు ఇండస్ట్రీలోని స్టార్స్ ని టార్గెట్ చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.. డీజీపీ కార్యాలయానికి ఈమెయిల్ రూపంలో బెదిరింపు వచ్చింది.. పోయస్ గార్డెన్‌లో ఉన్న రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో బాంబులు పెట్టినట్లు సమాచారం వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తాజాగా మరో తమిళ నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగి హడావిడి చేస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు.. 

తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభు.. ఆయన ఇంటికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఈ విషయంపై డీజీపీ కార్యాలయానికి ఒక ఈమెయిల్‌ చేరింది. అందులో చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్‌ సమీపంలో ఉన్న అమెరికా డిప్యూటీ కాన్సులేట్‌లో కొద్దిసేపట్లో బాంబు పేలబోతుందని బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే అదే ఈమెయిల్‌లో నటుడు ప్రభు ఇంట్లో కూడా బాంబు పేల్చుతామని హెచ్చరించారు.. ఈ మెయిల్స్ కి పోలీసులు వెంటనే అప్రమత్తమ అయి ఆ ఇళ్ళకి సోదాలు నిర్వహించడానికి బాంబు స్క్వాడ్ని తీసుకెళ్లారు.. ప్రస్తుతం అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Also Read :బిగ్ బాస్ 9 లో టాప్ 5 ఎవరున్నారు..? ఈ వారం ఎలిమినేట్ అతనే..?

ఆకతాయిల పనే అని పోలీసుల అనుమానం.. 

తమిళ ఇండస్ట్రీలోని పలువురు సీనియర్ హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. రజినీ కాంత్, ధనుష్ ఇళ్లలో బాంబులు పెట్టినట్లు మెయిల్ వచ్చినట్లే ఇప్పుడు కూడా మరో మెయిల్ వచ్చింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఎటువంటి పేలుడు లభించక పోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎవరు ఆకతాయిలు చేసిన పని అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ మెయిల్స్ ఎవరు పంపిస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. త్వరలోనే మెయిల్స్ పంపిస్తున్న వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.. ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలకి ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం.. ఎందుకు ఆ హీరోలనే టార్గెట్ చేశారు.. ఏదైనా హింట్ ఇస్తున్నారా? లేకపోతే ఫ్యూచర్లో అలాంటి పని చేయబోతున్నారా? పోలీసులు ఆ మెయిల్ పంపిన వాళ్ళని త్వరగా పట్టుకోవాలని ఆ హీరోల అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×