BigTV English
Advertisement

Bahubali The Epic: బాహుబలి: ది ఎపిక్.. రివ్యూ పంచుకున్న స్టార్ కిడ్!

Bahubali The Epic: బాహుబలి: ది ఎపిక్.. రివ్యూ పంచుకున్న స్టార్ కిడ్!

Bahubali The Epic: ప్రముఖ దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli ) అత్యంత ప్రతిష్టాత్మకంగా బాహుబలి (Bahubali ) సినిమాను తెరకెక్కించి…తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాహుబలి ఫ్రాంచైజీ లో భాగంగా బాహుబలి 1 & 2 లను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న రీ రిలీజ్ చేయనున్నారు. అయితే విదేశాలలో ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్ షోలు పడిపోయాయి. తాజాగా ఓవర్సీస్ లో ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) తనయుడు గౌతమ్ ఘట్టమనేని (Gautham Ghattamaneni)ఈ చిత్రంపై తన రివ్యూ పంచుకుంటూ ప్రశంసలు కురిపించారు.


బాహుబలి ది ఎపిక్ పై గౌతమ్ రివ్యూ..

ఘట్టమనేని గౌతమ్ మాట్లాడుతూ ..” వరల్డ్ లోనే అతిపెద్ద థియేటర్లో బాహుబలి: ది ఎపిక్ మూవీని చూడడం నేను నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడో తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండు సంవత్సరాలు వేచి చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎడిట్ చేసిన ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా ఇంత ఆదరణ దక్కడం మరింత సంతోషం అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు భాగాలను ఒకేసారి చూడడం చాలా కొత్తగా ఉంది. నిజంగా ఇది ఒక ఎపిక్ సినిమా. ప్రతి సెకండ్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. క్రేజీ ఫీలింగ్.. ఈ అనుభవాన్ని నేను మాటల్లో కూడా చెప్పలేను” అంటూ గౌతమ్ ఘట్టమనేని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మొత్తానికి అయితే గౌతమ్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ALSO READ:Sankranti -2026: సంక్రాంతి బరి నుంచి యంగ్ హీరో అవుట్… త్యాగం చేస్తున్నాడా?


ఎస్ఎస్ఎంబి 29 పై గౌతమ్ రియాక్షన్..

తాజాగా మీడియా మిత్రులు ఎస్ఎస్ఎంబీ 29 మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వమని అడగగా.. దీని గురించి నేనేం చెప్పలేను.. నన్ను అడగవద్దండి.. నాకేం తెలియదు అంటూ సరదాగా చెప్పుకొచ్చేశారు. మొత్తానికైతే తన తండ్రి రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ గురించి ఎటువంటి అప్డేట్ లేదని చెప్పి తప్పించుకున్నారు.

బాహుబలి ది ఎ పిక్ నుంచి తొలగించిన సన్నివేశాలు ఇవే..

ఇకపోతే బాహుబలి ది ఎపిక్ నుండి అవంతిక లవ్ స్టోరీ, పచ్చబొట్టేసిన పాట, ఇరుక్కుపో పాట, కన్నా నిదురించరా పాట అలాగే యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాము అంటూ ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి తెలిపారు.. ఇకపోతే ఐదున్నర గంటల నిడివి ఉన్న ఈ రెండు సినిమాల నిడివిని 3:45 గంటలకు కుదిస్తూ సినిమాను విడుదల చేయడం జరిగింది. మరోవైపు రీ రిలీజ్ సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి నెలకొంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ లో కూడా ఈ సినిమా జోరు చూపిస్తోంది. 100 కోట్లు గ్యారెంటీ అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ మొంథా తుఫాను సమయంలో బాహుబలి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

Yash Toxic: టాక్సిక్ సినిమా విడుదల వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

Jr NTR Dragan: గొడవలు పక్కన పెట్టి.. మళ్లీ సెట్స్‌లోకి… నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే?

Akhanda 2: అప్పుడు పండిట్స్.. ఇప్పుడు సిస్టర్స్.. తమన్ మాస్టర్ ప్లాన్ వెనుక కారణం?

Lokesh Kanagaraj : కూలీ కూలిన ఎఫెక్ట్… చివరికి కార్తీ కూడా హ్యాండ్ ఇచ్చాడా?

Jailer 2: రజినీకాంత్ మూవీలో మరో హీరో.. గెస్ కూడా చేసుండరు భయ్యా !

Actor Prabhu : నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు..

Sankranti -2026: సంక్రాంతి బరి నుంచి యంగ్ హీరో అవుట్… త్యాగం చేస్తున్నాడా?

Big Stories

×