Bigg Boss 9 Telugu : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ప్రస్తుతం సీజన్ 9 ప్రసారం అవుతుంది. 7 వరాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 8వ వారం ఆసక్తిగా మారుతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టాస్కులు ఎంటర్టైన్మెంట్ పెద్దగా కనిపించలేదు కానీ గొడవలు మాత్రం బాగానే ఉన్నాయి అంటూ నెటిజెన్లు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. ఎనిమిదో వారం కూడా పూర్తికా వస్తున్న నేపథ్యంలో హౌస్ నుంచి ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు..? అసలు ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ లో టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరో తెలుసుకోవాలని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు మనం టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల గురించి, ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతుంది. ఎవరూ ఊహించని విధంగా ముందుకు సాగుతున్నది. ఎనిమిదో వారంలో కూడా ట్విస్టులతో ఆడియన్స్ ను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుంది. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను ఇంటిలోకి పంపి షోను రక్తి కట్టించే ప్రయత్నం చేశారు.. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారందరినీ మళ్లీ హౌస్ లోకి పంపించి గొడవలకు కాస్త ఆజ్యం పోసే ప్రయత్నం బిగ్ బాస్ చేస్తున్నాడని స్పష్టమవుతుంది.. అయితే ఇప్పుడు మరో చర్చ జరుగుతుంది. హౌస్ లో టాప్ ఫైవ్ లిస్టులో ఎవరున్నారు అన్నది ఆడియన్స్ కు చిక్కుముడిగా మారింది. ఇంటిలో తమ ఆటతో రియాలిటీ షోపై ప్రభావం చూపుతున్న వారిలో ఇమ్మాన్యుయేల్, తనుజా గౌడ, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, సుమన్ శెట్టి, కల్యాణ్ లు ఉన్నారు. ప్రతి గేమ్ లో వీరే పోటీ పడి ఆడుతున్నారు. వీళ్ళలో ఒక్కరు విన్నర్ గా నిలుస్తారనే అభిప్రాయానికి జనాలు వస్తున్నారు.
Also Read : గుడ్డిగా నమ్మి మోసపోయిన వేదవతి.. శ్రీవల్లి ఎంట్రీతో షాక్.. ధీరజ్ జైలుకు వెళ్తాడా..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఇప్పటికే ఏడు వారాలు పూర్తయింది. గతవారం రమ్య మోక్ష ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. ఇక ఈవారం అందరూ టాప్ కంటెస్టెంట్లు కావడంతో ఎవరు బయటికి వెళ్తారు అన్నది ఆసక్తిగా మారింది.. ఈ వారం నమోదు అయిన ఓటింగ్, నామినేషన్స్ ప్రకారం చూస్తే ఈ వారం ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారి జాబితాలో కల్యాణ్ పడాల, రాము రాథోడ్, డీమాన్ పవన్, గౌరవ్, సంజనా, తనూజా గౌడ, మాధురీ, రీతూ చౌదరీ ఉన్నారు. వీరిలో లీస్ట్ ఓటీంగ్ లో గౌరవ్, లేదా రాము వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. హౌస్ లో చాలామంది ఉండడంతో ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ చిక్కుముడికి సమాధానం దొరకాలంటే మరో రెండు రోజుల్లో ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాలి..