SHREYAS IYER: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అయ్యర్ కి సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మూడవ వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ పక్కటెముకల ప్రాంతంలో బలంగా దెబ్బ తగిలింది.
Also Read: Glenn Phillips: ప్రియురాలితో ఫీట్లు.. ఈ క్రికెటర్ మామూలోడు కాదురో
దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. మొదట శ్రేయస్ అయ్యర్ సాధారణ గాయంగా భావించాడు. కానీ ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే స్కానింగ్ లో ప్లీహానికి తీవ్రమైన గాయం అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం అతడిని ఐసియు కి తరలించారు.
గాయంతో ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రేయస్ అయ్యర్ తన ఆరోగ్యం పై తొలిసారి స్పందించాడు. ” నేను ప్రస్తుతం రికవరీ ప్రక్రియలో ఉన్నాను. నాకు అండగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ఇది నిజంగా నాకు చాలా విలువైనది. మీ అందరి ప్రేమ, మద్దతు నాకు చాలా విలువైంది. నన్ను మీ ప్రార్ధనలలో గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు.” అంటూ గురువారం రోజు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ చేసిన ఈ పోస్ట్ తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
శ్రేయస్ అయ్యర్ గాయంపై బీసీసీఐ కూడా ఈ నెల 27, 28 తేదీలలో ప్రకటనలు విడుదల చేసింది. ” మూడవ వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ కడుపు భాగంలో బలమైన దెబ్బ తగలడంతో ప్లీహమ్ దెబ్బతింది. దీంతో అంతర్గత రక్తస్రావం జరిగింది. గాయాన్ని గుర్తించి వెంటనే రక్త స్రావాన్ని అరికట్టడం జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగుపడినట్లు తేలింది. సిడ్ని, భారత నిపుణుల పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ కోలుకుంటున్నాడు” అని వివరించింది.
Also Read: Arshdeep Singh: తొలి టీ-20లో అర్షదీప్ ను తప్పించడంపై ట్రోలింగ్.. హర్షిత్ రాణా పెద్ద తోపా అంటూ !
ఇక తాజాగా అయ్యర్ కూడా తన ఆరోగ్యం పై స్పష్టత ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లీహానికి జరిగిన గాయం పూర్తిగా మానాలంటే 6 నుంచి 12 వారాల సమయం పడుతుంది. ఈ సమయంలో గాయానికి గురైన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రికవరీ సమయంలో మరొకసారి ప్లీహానికి గాయమైతే మళ్లీ అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ మళ్ళీ బ్యాట్ పట్టాలంటే దాదాపు 3 నెలల వరకు ఆగాల్సిందే. కానీ ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ శారీరకంగా ఫిట్ గా ఉన్నాడు కాబట్టి.. మరి కాస్త తక్కువ సమయంలోనే రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అతడు త్వరగా కోలుకొని.. మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలని అటు టీమిండియా ఆటగాళ్లు, ఇటు బిసిసిఐ, అభిమానులు కోరుకుంటున్నారు.
— Shreyas Iyer (@ShreyasIyer15) October 30, 2025