Akhanda 2 Event : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు హ్యాట్రిక్ సక్సెస్ సాధించాయి. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న తరుణంలో ఈ సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సక్సెస్ మీట్ ఈవెంట్ లో బాలకృష్ణ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా అదృష్టం ఏంటంటే నేను ఒక పాదరసం లాంటి వాడిని. దేనికైనా సరే ఛాలెంజ్. పాదరసం తెలుసు కదా మీకు. దేనిలో వేస్తే ఆ ఆకారం తీసుకుంటుంది అది. నేను కూడా అంతే. నేను చాలా అదృష్టవంతుడిని ఈ జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులకు, నన్ను వాళ్లకి పుట్టించినందుకు ఆ భగవంతునికి, తెలుగు కళామతల్లికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
ఒకవైపు సినిమా నటుడుగా, మరోవైపు హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే ఇంకొక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా అన్నీ చేయగలుగుతున్నాను. ఒకటైతే మాత్రం అతుక్కుని ఉండిపోయాను. మా ఆవిడ అంటుంది ఎప్పుడు. నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు. నన్నే అంటి పెట్టుకున్నారు అని.
అంటే ఈ మాటలు బాలకృష్ణ మామూలుగా మాట్లాడిన కూడా ఒకరికి మాత్రం బలంగా ట్రిగ్గర్ అయ్యేటట్లు ఉన్నాయి. మామూలుగా చాలామంది పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ అతనిని ట్రోల్ చేస్తూ ఉంటారు. చాలామంది మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు అంటుంటారు. బహుశా ఇప్పుడు బాలకృష్ణ ఒకరే భార్య అనే విషయాన్ని పట్టుకొని చాలామంది సోషల్ మీడియాలో చాలామంది రోల్ చేసే అవకాశం ఉంది.
ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెబుతున్నట్లు వీడియో కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. ఈసారి కూడా వరుస సక్సెస్ ఈ కాంబినేషన్ సాధించబోతుంది అని అందరూ ఊహిస్తున్నారు. ఏ స్థాయి సక్సెస్ అందుతుందో డిసెంబర్ 5న తెలుస్తుంది.
Also Read: Akhanda 2 Event : సినిమాలో సంయుక్త పాత్ర పూర్తిగా ఉండదు, స్పీచ్ కూడా మధ్యలో ఆపేస్తే ఎలా?