Boycott Sai Pallavi: ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి సాయి పల్లవి(Sai Pallavi). మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన సాయి పల్లవి అనంతరం వరస సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా సాయి పల్లవి సినిమా చేస్తుందంటేనే ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటమే కాకుండా మంచి విజయాలను అందుకుంటున్నాయి.
ఇలా సినిమాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయి పల్లవికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కేవలం ఈమె సినిమాలు చూసి మాత్రమే కాకుండా తన వేషధారణ చూసి కూడా ఎంతోమంది ఈమెకు అభిమానులుగా మారిపోయారు. సినిమా ఎలాంటిదైనా, హీరోలు ఎవరైనా సరే స్కిన్ షో చేయడానికి సాయి పల్లవి అసలు ఇష్టపడదు. నిర్మొహమాటంగా తాను గ్లామర్ పాత్రలు చేయనని చెబుతూ ఉంటారు. అయితే తాజాగా సాయి పల్లవికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎప్పుడు ఎంతో నిండుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ బీచ్ లో ఏకంగా బికినీ(Bikini) ధరించి కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
రామాయణ నుంచి తొలగించాల్సిందే?
సాయి పల్లవి ఇలా బికినీలో కనిపించడం ఏంటి అంటూ ఆశ్చర్యపోవడమే కాకుండా నిజంగానే సాయి పల్లవి ఇలాంటి ఫోటోలకు ఫోజులిచ్చారా? లేకపోతే ఏఐ మహిమ? అంటూ కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే సోషల్ మీడియాలో సాయి పల్లవికి ఊహించని షాక్ ఎదురయింది. ఇలా బికినీలో బీచ్ లో ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత రావడమే కాకుండా, కొంతమంది బాయ్ కాట్(Boycott) సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇలా స్విమ్ సూట్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చే ఈమె రామాయణలో నటించడం ఏంటీ? వెంటనే ఈమెను రామాయణ సినిమా (Ramayana Movie)నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
సీత పాత్రలో సాయి పల్లవి..
సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సాయి పల్లవి జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రామాయణ. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే సాయి పల్లవిని సీతగా ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను కూడా చిత్ర బృందం వెల్లడించారు. ఇప్పటివరకు సాయి పల్లవి ఎక్కడా కూడా గ్లామర్ పాత్రలలో నటించలేదు, పెద్దగా స్కిన్ షో కూడా చేయలేదు, అందుకే తనని సీత పాత్ర కోసం ఎంపిక చేసాము అంటూ తెలియజేశారు. ఇలా సీతమ్మగా నటిస్తున్న సాయి పల్లవి ఒక్కసారిగా బికినీలో కనిపించడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి.మరి ఈ వివాదం పై సాయి పల్లవి స్పందన ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Dulquer -Pruthivi Raj: ఆపరేషన్ నమకూర్ ..స్టార్ హీరోల ఇంట్లో కస్టమ్స్ సోదాలు