Diet tips: మనలో చాలామంది రాత్రి భోజనంలో అన్నం ఎక్కువగా తీసుకుంటారు. తిన్న వెంటనే నిద్రపోతారు కూడా. ఈ విధానం శరీరానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. రాత్రిపూట ఎక్కువ అన్నం తింటే కడుపు బరువుగా మారుతుంది, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో నిద్ర సరిగా రాదు, ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తుంది. కొంతమందికి అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా వస్తాయి. అదనంగా బరువు పెరగడానికీ కారణమవుతుంది. ఈ సమస్యలు దూరం కావాలంటే రాత్రి భోజనంలో చిన్న మార్పు చేస్తే సరిపోతుంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రాత్రి ఇలా చేయండి
ఇలాంటి సమస్యలు దూరం చేయాలంటే రాత్రి భోజనంలో చిన్న మార్పు చేస్తే సరిపోతుంది. ఆ మార్పు ఏమిటి అంటే, అన్నం బదులుగా చిన్న రాగి ముద్ద తినడం. ఎందుకంటే, రాగిలో శరీరానికి కావాల్సిన ఫైబర్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రాత్రి తిన్నప్పుడు ఇది తేలికగా జీర్ణమవుతుంది. కడుపు బరువుగా అనిపించదు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది.
Also Read: Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!
రాగిలో ఉండే ఐరన్ రక్తం తయారవడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇంకా రాగిలో ఉండే ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వలన జలుబు, జ్వరం, చిన్నచిన్న ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. రాత్రి తేలికగా తినడం వలన నిద్ర సులభంగా వస్తుంది. ఉదయం లేవగానే ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
బరువు నియంత్రణ
రాగి ముద్ద మరో ప్రయోజనం ఏమిటంటే బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఇది నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారం కావడం వలన ఎక్కువసేపు ఆకలి వేయదు. అతి తినడం తగ్గిపోతుంది. షుగర్ ఉన్న వారికి కూడా ఇది మంచిది. అన్నం బదులుగా రాగి ముద్దను తినడం అలవాటు చేసుకుంటే జీర్ణవ్యవస్థ బాగుంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న మార్పు చేసినా ఆరోగ్యంలో పెద్ద ఫలితం కనబడుతుంది.