Dulquer -Pruthivi Raj: మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salman), పృథ్వీరాజ్ సుకుమారన్(Pruthvi Raj Sukumaran) ఇంటిపై కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విదేశాల నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే మంగళవారం కేరళ కొచ్చిలోని ఈ ఇద్దరి హీరోల నివాసాల పై దాడి చేశారు. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో ఒకేసారి 30 ప్రదేశాలలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
భూటాన్ నుంచి అక్రమంగా వాహనాలను దిగుమతి చేసుకున్న నేపథ్యంలోనే అధికారులు “ఆపరేషన్ నమకూర్” పేరుతో సోదాలను నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. పలు నివేదికల ప్రకారం భూటాన్ నుంచి సెకండ్ హ్యాండ్ వాహనాలను తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటికి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా భారతదేశంలో అక్రమంగా రవాణా చేస్తున్నట్టు సమాచారం అందిన నేపథ్యంలోనే అధికారులు దాడులను నిర్వహించారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను దిగుమతి చేసుకున్న నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు జాబితాను సిద్ధం చేసి ఏకకాలంలో వీరి ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
నిర్మాతగా సక్సెస్ అయిన దుల్కర్…
ఇప్పటివరకు ఈ దాడుల గురించి నటుడు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఎక్కడ స్పందించలేదు.. ఇకపోతే ఈ ఇద్దరు హీరోల కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇద్దరు కేవలం మలయాళం చిత్ర పరిశ్రమలో ఒక మాత్రమే కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. దుల్కర్ సల్మాన్ ఇటీవల కాలంలో నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి వరుస సక్సెస్ సినిమాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల లోక్ అంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తెలుగులో లక్కీ భాస్కర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టారు. ప్రస్తుతం పలు సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
తెలుగులో హవా చాటుతున్న హీరోలు…
ఇక పృధ్వీరాజ్ సుకుమారన్ విషయానికి వస్తే ఈయన కూడా మలయాల నటుడు అయినప్పటికీ తెలుగులో అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సలార్ సీక్వెల్ సినిమాతో పాటు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న SSMB 29 సినిమాలో కూడా పృథ్వీరాజ్ కీలకపాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ ఇద్దరు మలయాళ హీరోలు తెలుగులో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకొని పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ తో మళ్ళీ దొరికిపోయిన సామ్..రిలేషన్ కన్ఫామ్ చేయొచ్చుగా?