E-Paper
Advertisement

Buchi Babu Sana: ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు చేసేది ఆ హీరోతోనేనా?

Buchi Babu Sana: ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు చేసేది ఆ హీరోతోనేనా?
Advertisement

Buchi Babu Sana: తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppena)తోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana), ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Mega Power Star Ram Charan)తో ‘పెద్ది’ (Peddi) అనే భారీ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, టాలీవుడ్ వర్గాల్లో బుచ్చిబాబు నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకవైపు రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి బుచ్చిబాబుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో వీరిద్దరి కాంబోలో ఒక భారీ ప్రాజెక్ట్ 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో బుచ్చిబాబు జతకడితే బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయని ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఊహించేసుకుంటున్నారు.

Also Read- Virosh Wedding: విజయ్ రష్మిక‌ల పెళ్లికి వచ్చే అతిథులు, పెళ్లిలో నోరూరించే మెనూ వివరాలివే!

ప్రభాస్ రెడీ.. కాకపోతే!

Advertisement

అయితే, లేటెస్ట్ సమాచారం ప్రకారం బుచ్చిబాబు మూడో సినిమా ప్రభాస్‌తో కంటే ముందే అఖిల్ అక్కినేనితో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ తన ఆరో సినిమాగా ‘లెనిన్’ (Lenin) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బుచ్చిబాబు చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ లైన్‌కు అఖిల్ ఫిదా అయ్యాడని, ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా ముగిశాయని ఇండస్ట్రీ టాక్. ‘ఏజెంట్’ వంటి డిజాస్టర్ తర్వాత ఒక సరైన కమర్షియల్ హిట్ కోసం చూస్తున్న అఖిల్‌కు, బుచ్చిబాబు మార్క్ ఎమోషనల్ డ్రామా అయితే కచ్చితంగా వర్కవుట్ అవుతుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు రామ్ చరణ్‌తోనే మరోసారి ఆయన సినిమా చేయనున్నారనేలా కూడా వార్తలు నడుస్తున్నాయి.

Also Read- Shanmukh Jaswanth:వైష్ణవితో ఘనంగా జరిగిన షణ్ముఖ్ జశ్వంత్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్..

బుచ్చిబాబు క్రేజ్ ఇది..

Advertisement

ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుండటంతో బుచ్చిబాబు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘పెద్ది’ రిజల్ట్‌ను బట్టి ఈ ప్రాజెక్టులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ అఖిల్ సినిమా అధికారికంగా ఖరారైతే, అది అక్కినేని ఫ్యాన్స్‌కు పెద్ద బూస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. ప్రభాస్ లైనప్ ఇప్పటికే చాలా బిజీగా ఉండటంతో, బుచ్చిబాబు తన మూడో చిత్రాన్ని అఖిల్‌తోనే సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ యంగ్ డైరెక్టర్ ఎవరితో తన హ్యాట్రిక్ మూవీని ప్రకటిస్తాడో వేచి చూడాలి! అప్పటి వరకు ఇలా ఎందరో హీరోల పేర్లు వినిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అఖిల్‌తో మాత్రం పక్కా అనేలానే టాలీవుడ్ సర్కిల్స్‌లో అయితే వార్తలు వైరల్ అవుతున్నాయి. చూద్దాం.. మరి ఫైనల్‌గా బుచ్చి మూడో సినిమా హీరో ఎవరు అవుతారో?

Also Read- Vrushakarma Glimpse: నాగచైతన్య వృషకర్మ పై బిగ్ అప్డేట్ .. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×