E-Paper
Advertisement

Vrushakarma Glimpse: నాగచైతన్య వృషకర్మ పై బిగ్ అప్డేట్ .. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Vrushakarma Glimpse: నాగచైతన్య వృషకర్మ పై బిగ్ అప్డేట్ .. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Advertisement

Vrushakarma Glimpse: అక్కినేని నాగచైతన్య ఇటీవల కాలంలో వరుస సినిమాల పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఈయన చివరిగా తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాగచైతన్య(Nagachaitanya) తదుపరి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి తదుపరి చిత్రాన్ని విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu)దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వృషకర్మ (Vrushakarma)అని పేరుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

నాగచైతన్య వృష కర్మ గ్లింప్స్ ..

ఇక ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలలో ఈ సినిమా విడుదల కావచ్చనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఏ విధమైనటువంటి అప్డేట్ వెల్లడించలేదు అయితే తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ తెలియజేశారు. వృషకర్మ గ్లింప్స్ మార్చ్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా అధికారకంగా తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాలో నటీనటులను పరిచయం చేస్తూ వారి ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూనే సినిమాపై మంచి అంచనాలను పెంచేశారు.

దక్ష పాత్రలో మీనాక్షి చౌదరి..

Advertisement

ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి దక్ష అనే పాత్రలో నటించబోతున్నారు. ఈమె పురావస్తు శాస్త్రవేత్తగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. వృషకర్మ నాగచైతన్య సినీ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా, మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విరూపాక్ష సినిమా తర్వాత కార్తీక్ వృషకర్మ సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఒక మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తుంది.

Advertisement

ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరో హీరోయిన్లుగా నటించగా స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నాగచైతన్య సినీ కెరియర్ లో ఈ సినిమా 24వ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై ఏ విధమైనటువంటి స్పష్టత లేదు.

Also Read: Samantha: రాజమౌళి ఈగ సినిమాపై సమంత కామెంట్స్…సెకండ్ ఛాన్స్ వస్తే అంటూ!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×