E-Paper
Advertisement

Kanchana 4: ‘కాంచన 4’ కూడా మార్చిలోనే.. మరి ప్రమోషన్స్ సంగతేంటి?

Kanchana 4: ‘కాంచన 4’ కూడా మార్చిలోనే.. మరి ప్రమోషన్స్ సంగతేంటి?
Advertisement

Kanchana 4: టాలీవుడ్, కోలీవుడ్‌లో హారర్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే రాఘవ లారెన్స్ (Raghava Lawrence), ఆయన సృష్టించిన ‘ముని’ (Muni) సిరీస్. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన మూడు భాగాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న ‘కాంచన 4’ (Kanchana 4) పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ సినిమా షూటింగ్ చప్పుడు కాకుండా సైలెంట్‌గా పూర్తయిపోయిందని, ఏకంగా మార్చి 13న విడుదలకు సిద్ధమవుతోందని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు హైలెట్ అవుతున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలకు నెల రోజుల ముందు నుండే హడావిడి మొదలవుతుంది, కానీ ఈ సినిమా విషయంలో మేకర్స్ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read- Virosh Wedding: విజయ్ రష్మిక‌ల పెళ్లికి వచ్చే అతిథులు, పెళ్లిలో నోరూరించే మెనూ వివరాలివే!

ఎటువంటి హడావిడి చేయకుండానే..

Advertisement

మార్చి 13న విడుదల అంటే ఇంకా చేతిలో కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇంతవరకు ఒక టీజర్ కానీ, ట్రైలర్ కానీ, కనీసం అఫీషియల్ సాంగ్ కూడా బయటకు రాలేదు. ఈ తక్కువ సమయంలో ఆడియన్స్‌లో హైప్ ఎలా క్రియేట్ చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే, లారెన్స్ గత సినిమాల హిస్టరీ చూస్తే.. ఆయన పెద్దగా హడావిడి చేయకుండానే థియేటర్లలో మ్యాజిక్ చేస్తుంటారు. ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారా? లేక అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అనే చర్చ నడుస్తోంది. నైజాం ఏరియాలో ఈ సినిమా పంపిణీ బాధ్యతలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారనే వార్త చూస్తుంటే, పక్కా ప్లానింగ్‌తోనే సైలెంట్‌గా వస్తున్నట్లు అర్థమవుతోంది. అందులో మార్చి‌లో ఎలాంటి సినిమాలు విడుదల ఉన్నాయో తెలియంది కాదు. అంత పోటీలో ఈ సినిమా అంటే ఆలోచించాల్సిన విషయమే.

Also Read- Adhira: ఫైనల్ గా ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్ మొదలు.. హీరో, హీరోయిన్ ఎవరంటే..!

అధికారిక ప్రకటన ఎప్పుడు?

Advertisement

ఇక ఈ పార్ట్ 4లో పూజా హెగ్డే, నోరా ఫతేహి వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారని టాక్. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు గ్రాఫిక్స్ కోసం పనిచేస్తున్నారనేలా కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన మూడు పార్ట్‌ల కంటే హారర్ ఎలిమెంట్స్ ఇందులో ఎక్కువగా ఉండబోతున్నాయట. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, వచ్చే వారం నుండి ప్రమోషన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. ఒకవేళ మార్చి 13న రావడం పక్కా అయితే, ఈ వీకెండ్ లోపు అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ‘కాంచన 4’కి ఇదే సరైన సమయం. మరి లారెన్స్ ఈసారి ఎంతలా భయపెడతాడో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే! అసలు ముందు అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారనేది తెలియాల్సి ఉంది.

Also Read- Nani: అభిమానికి హ్యాండ్‌షేక్ ఇవ్వడానికి నిరాకరించిన హీరో నాని.. మరి అంత అహమా..!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×