E-Paper
Advertisement

Bunny Vas: మలయాళ నిర్మాతలను హెచ్చరిస్తూ.. తెలుగు సినిమాపై బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్!

Bunny Vas: మలయాళ నిర్మాతలను హెచ్చరిస్తూ.. తెలుగు సినిమాపై బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్!
Advertisement

Bunny Vas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాను నిర్మించడం అంతా ఈజీ కాదని అన్నారు నిర్మాత బన్నీ వాసు (Bunny Vas). మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’ (Pallichattambi). ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రెస్టీజియస్ మూవీ.. ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌తో రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Also Read- విజయ్ మాజీ భార్యకు నెలకు 49 లక్షలు… ఇది భరణం కాదు బ్రో.. జస్ట్ గిఫ్ట్!

భారీ కమర్షియల్ మూవీ

Advertisement

ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. మారుతి ఈ సినిమా ప్రొడ్యూసర్స్ టీమ్‌ను మాకు పరిచయం చేశారు. వాళ్లతో మాట్లాడిన తర్వాత ఒక ప్రతిష్టాత్మక మూవీ చేస్తున్నారని అర్థమైంది. కొచ్చి తీసుకెళ్లి సినిమా చూపించారు. మన తెలుగు వాళ్లు కేరళ వెళ్లి ఇలాంటి ఒక భారీ చిత్రాన్ని నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమా టెక్నికల్‌గా చాలా క్వాలిటీగా, హ్యూజ్ స్కేల్‌లో ఉంటుంది. తెలుగు ఆడియెన్స్‌కు ఒక కొత్త కమర్షియల్ మూవీ అవుతుందని చెప్పగలను. మలయాళం మూవీస్ అంటే మనం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌గా భావిస్తాం కానీ, ఈ సినిమా మాత్రం ఒక భారీ కమర్షియల్ మూవీ. తెలుగులో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. మా దగ్గరకు పదేళ్ల క్రితం వచ్చి, మాతో ట్రావెల్ అయిన మేఘశ్యామ్ ఈ సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్‌‌గా వర్క్ చేయడం హ్యాపీగా ఉంది.

Also Read- Divya Bharathi: నడుము వయ్యారాలతో చక్కిలిగింతలు పెడుతున్న దివ్యభారతి!

తెలుగులో సినిమా చేయడం కష్టం

Advertisement

టొవినో థామస్ చేసిన 2018 చిత్రాన్ని మేము తెలుగులో రిలీజ్ చేశాం. మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రంలో ఆయన నటన, యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. నాకు మోహన్ లాల్‌ను చూసినట్లు అనిపించింది. ఈ సినిమా తర్వాత కయదుకు మరింత మంది ఫ్యాన్స్ పెరుగుతారు. డైరెక్టర్ ఈ మూవీని తీసిన విధానం, ఎడిటింగ్ చేయించిన విధానం బాగా నచ్చింది. ఒక న్యూ కమర్షియల్ మూవీ చూడాలంటే పళ్లిచట్టంబి థియేటర్స్‌లో చూడండి. ఈ చిత్ర నిర్మాతలు తెలుగులో సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే. తెలుగు సినిమా చేయడానికి కంగారు పడకండి. మలయాళంలో సినిమాలు చేయడం చాలా ఈజీ. మలయాళంతో పోల్చుకుంటే తెలుగులో సినిమా చేయడం కొద్దిగా కష్టం. అనుభవం ఉన్న నిర్మాతగా చెబుతున్నాను. తెలుగులో సినిమా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని చిత్ర నిర్మాతలకు ఆయన సూచనలిచ్చారు.

Also Read- అనుష్క శెట్టి ‘కథనార్’ ట్రైలర్.. ఆ వీఎఫ్ఎక్స్ ఏంటి భయ్యా, హాలీవుడ్ రేంజ్ ఉంది!

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×