Brahmanandam Gets Emotional: ప్రముఖ సింగింగ్ షోతో ప్రముఖ నటుడు, ‘హాస్య బ్రహ్మా‘ బ్రహ్మనందం (Brahmanandam Emotional Video) ఎమోషనల్ అయ్యారు. ఇండియన్ ఐడల్ షోకి అతిగా వచ్చిన ఆయన ప్రముఖ సింగర్‌ని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఆహా తొలిసారి తెలుగు తెరపైకి ఇండియన్ ఐడల్ షో (Indian Idol Season 4)ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా ఎంతో టాలెంటెడ్ సింగర్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సింగింగ్ షో ప్రస్తుతం నాలుగవ సీజన్ని జరుపుకుంటోంది.
ఈ క్రమంలో తాజాగా విడుదల లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించి ప్రొమో విడుదల చేసింది ఆహా టీం. ఈ ఎపిసోడ్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తనదైన కమెడీ, పంచ్లతో షోలో ఉత్సాహాన్ని నింపారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ వచ్చి రాగానే ఆయన తనదైన తీరుతో షోలో సందడి చేశారు. హోస్ట్, సింగర్ సమీరా.. మీ రాక కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నానని, అల్లాడిపోతున్నా అంటూ చమత్కరించింది. ఇక బ్రహ్మానందం కూడా తన కామెడీతో షో జడ్జస్, హోస్ట్, కంటెస్టెంట్స్లో జోష్ నింపారు. ఈ సందర్బంగా బ్రహ్మనందం కీలక పాత్రలో నటించిన మనీ చిత్రంలో వారెవా ఏం ఫేసు పాట పాడి ఆయనకు అంకీతం చేశారు కంటెస్టెంట్స్.
ఇలా సరదాగా, జోష్ఫుల్గా సాగిన ఈ షో ఒక్కసారిగి భావోద్వేగాలు నిండిపోయాయి. ఈ సందర్భంగా దివంగత గాయకుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం గారిని తలుచుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఎస్పీబీతో నాది చిన్న అనుబంధం కాదు పెద్దదే. మా రెండు కుటుంబాలు ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవి. చెన్నైలో ఉన్నప్పటి నుంచి మా మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ, ఆయన మరణం ఇండస్ట్రీకే కాదు మాకు కూడా తీరని లోటు అంటూ బ్రహ్మనందం కన్నీరుమున్నీరు అయ్యారు. ఏడుపు ఆపుకోలేక ఆయన గుక్కపెట్టిన ఈ వీడియో అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది.
Also Read: Bollywood Movies: హిందీ సినిమాలపై నిషేధం… అసెంబ్లీలో బిల్లు.. సీఎం సంచలన నిర్ణయం
బ్రహ్మానందం మాటలకు అక్కడున్న జస్టస్ తమన్, కార్తీక్, గీతా మాధురిలు సైతం ఎమోషనల్ అయ్యారు. ఆటపాటలతో సాగిన ఈ షోలో ఒక్కసారిగి మౌనం, ఎమోషన్తో నిండింది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి 10 నుంచి 15 సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం చాలావరకు సినిమాలు తగ్గించారు. వయసు రీత్యా ఆయన నటనకు బ్రేక్ ఇచ్చారు. వీలు చిక్కినప్పుడల్లా చిన్న చిన్న సినిమాలు, ముఖ్యపాత్రలు పోషిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించిన ఆయన టీవీ షోలో కనిపించడంతో బుల్లితెరపై సందడి నెలకొంది.