BigTV English

Natasa Stankovic: ప్రియుడితో రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటషా?

Natasa Stankovic: ప్రియుడితో రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటషా?
Advertisement

Natasa Stankovic:  నటి నటాషా స్టాంకోవిక్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈమె సెర్బియా నటి అయినప్పటికీ ప్రతి ఒక్కరికి నటాషా సుపరిచితమే. ఈమె హార్దిక్ పాండ్యాతో రిలేషన్ పెళ్లి విడాకుల కారణంగా వైరల్ అయ్యారు. వివాహం జరిగిన తక్కువ సమయంలోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నటాషా మరో వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.


ఆ ఒక్క వీడియో వల్లనే విడాకులు జరిగాయా…!

నటాషా, హార్దిక్ పాండ్యా ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతులలో వివాహం జరుపుకున్నారు. వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు. వివాహం జరిగిన తక్కువ సమయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. తమ కుమారుడికి మాత్రం కో-పేరెంట్స్ గా ఇద్దరం ఉంటామని వెల్లడించారు. విడాకుల తర్వాత నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియా దేశానికి తిరిగి వెళ్ళిపోయింది. ఇండియాకు తిరిగి వచ్చినప్పుడల్లా తన మాజీ భర్త హార్దిక్ పాండ్యా వద్దకు కుమారుడిని పంపుతూ ఉంటుంది. విడాకుల తర్వాత నటాషా అలెగ్జాండర్ అనే వ్యక్తితో ఎఫైర్ కూడా నడిపిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీరిద్దరూ కలిసి కొన్ని రొమాంటిక్ వీడియోలు కూడా తీసుకున్నారు. అందులో ముద్దులు కూడా పెట్టుకుంటూ హాట్ గా రొమాన్స్ చేశారు. అయితే ఈ వీడియో వల్లనే నటాషా నుంచి హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నట్టుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని మరోవైపు అలెగ్జాండర్ తో ఘాటుగా రొమాన్స్ చేసింది ఈ భామ. వీరిద్దరూ కలిసి ముంబై వీధులలో కలిసి చక్కర్లు కూడా కొట్టారు. అనంతరం హార్దిక్ పాండ్యా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు.

Also Read: IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజ‌యం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మ‌న ర్యాంక్ ఎంతంటే


కొత్త గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా…!

విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా ఎన్నో రకాల ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. కొంతమంది హీరోయిన్లతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. అయినప్పటికీ హార్దిక్ పాండ్యా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు పోయారు. గత కొద్ది రోజుల క్రితం హార్దిక్ పాండ్యా సింగర్ జాస్మిన్ వాలియాతో రిలేషన్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు. రీసెంట్ గానే హార్దిక్ పాండ్యా తన పుట్టినరోజు సందర్భంగా తన ప్రియురాలు మహికా శర్మను పరిచయం చేశారు. వారిద్దరికీ సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు హార్థిక్ పాండ్య. దీంతో త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పైన హార్దిక్ పాండ్యా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

Related News

IPL 2026: ఐపీఎల్ 2026 లో పెను సంచ‌ల‌నం…ఢిల్లీ, KKRకు కొత్త కెప్టెన్లు?

Commonwealth Games 2030 : 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..20 ఏళ్ల త‌ర్వాత ఛాన్స్‌

Mahieka Sharma: పెళ్ళి కాకముందే మహికా శర్మ ప్రెగ్నెంట్.. హార్దిక్ పాండ్యా కక్కుర్తి.. అప్పుడు నటాషాకు కూడా !

IPL Valuation: కొంప‌ముంచిన కేంద్రం…భారీగా ప‌డిపోయిన ఐపీఎల్ !

Ranji Trophy 2025: ప్ర‌మాదంలో పృథ్వీ షా జ‌ట్టు…5 ప‌రుగుల‌కే 4 వికెట్లు..నలుగురు బ్యాటర్లు డకౌట్!

Noman Ali Welding Glasses: పాకిస్థాన్ బౌల‌ర్ ఇజ్జ‌త్ తీసిన రమీజ్ రాజా..వెల్డింగ్ షాప్ కళ్లజోడు అంటూ

IND VS AUS: గంభీర్ కు చెప్ప‌కుండానే ఆస్ట్రేలియాకు బ‌య‌లుదేరిన‌ రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే

Big Stories

×