NBK 111: టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు హీరోగా వరుస సినిమాలను నటిస్తూ దూసుకుపోతూనే మరొకవైపు ఎమ్మెల్యేగా కూడా బాధ్యతలను నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇలా రెండు పడవలపై ఒకేసారి ప్రయాణం చేస్తున్నారు. అయితే సినిమాల పరంగా, రాజకీయాల పరంగా బాలయ్య బాబు సక్సెస్ అవుతున్నారు. ఆయన నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కనెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.
అలా హీరోగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలలో తన ఖాతాలో వేసుకుంటున్నారు బాలయ్య బాబు. అలా గత నాలుగు సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఊపుతో సినిమాలలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2(Akhanda 2) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
గోపితో మరోసారి బాలయ్య..
ఈ మూవీకి బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ చిత్రం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే బాలయ్య బాబు తదుపరి సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే.. హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) కాంబో మరొకసారి రిపీట్ కాబోతోందట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో విడుదల అయిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతోపాటు రికార్డుల మోత మోగించింది.
చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందంటూ..
ఇప్పుడు రెండవసారి వీరి కాంబో రిపీట్ కాబోతోంది. ఇది బాలయ్య బాబు 111 వ చిత్రంగా రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి అయ్యిందట. మరి ముఖ్యంగా ఇందులో సెకండ్ హాఫ్ లో మాఫియా నేపథ్యంతో కూడిన యాక్షన్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు(Venkata Sathis Kilaru) నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమా గురించి స్పందిస్తూ గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్ అంటూ చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Pradeep Ranganathan: ఫౌజీ సినిమా పై టంగ్ స్లిప్ అయిన ప్రదీప్ రంగనాథన్..ఇలా చెప్పాడేంటీ?